Telugu Global
Telangana

రఘురామకు తెలంగాణ సిట్‌ నోటీసులు

ఎమ్మెల్యేల కొనుగోలుకు 100 కోట్ల రూపాయలను తాను సమకూరుస్తానని రఘురామ చెప్పినట్టు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

రఘురామకు తెలంగాణ సిట్‌ నోటీసులు
X

తెలంగాణలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నోటీసులు జారీ చేసింది. 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు అంద‌జేసింది.

ఎమ్మెల్యేల కొనుగోలుకు 100 కోట్ల రూపాయలను తాను సమకూరుస్తానని రఘురామ చెప్పినట్టు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దాంతో ఈ వ్యవహారంలో విచారించేందుకు రఘురామకృష్ణంరాజుకు నోటీసులు జారీ చేశారు. రామచంద్రాభారతి, నందు, సింహయాజిలతో రఘురామ టచ్‌ ఉన్నట్టు సిట్ భావిస్తోంది.

సాధారణంగా నేరం చేసిన వ్యక్తికి 41ఏ నోటీసులుఇచ్చి విచారణకు పిలుస్తుంటారు. రఘురామకృష్ణంరాజుకు కూడా అదే నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది.

Next Story