Telugu Global
Telangana

రెండు అవార్డులు గెల్చుకున్న సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్

ఢిల్లీలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (CBIP) నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో పవర్ ప్లాంట్ ఉత్తమ పనితీరు గల ప్లాంట్ అవార్డును అందుకుంది. గోవాలో జరిగిన ఫ్లై యాష్ మేనేజ్‌మెంట్‌పై జాతీయ స్థాయి సదస్సులో ఉత్తమ ఫ్లై యాష్ యుటిలైజేషన్ ప్లాంట్ అవార్డును అందుకుంది.

రెండు అవార్డులు గెల్చుకున్న సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్
X

సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది. రెండు వేర్వేరు జాతీయ స్థాయి సదస్సుల్లో సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్‌కు ఉత్తమ పనితీరు కనబరిచిన ప్లాంట్‌గా, బెస్ట్ ఫ్లై యాష్ యుటిలైజేషన్ ప్లాంట్‌గా ప్రతిభా పురస్కారం లభించింది.

ఢిల్లీలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (CBIP) నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో పవర్ ప్లాంట్ ఉత్తమ పనితీరు గల ప్లాంట్ అవార్డును అందుకుంది. గోవాలో జరిగిన ఫ్లై యాష్ మేనేజ్‌మెంట్‌పై జాతీయ స్థాయి సదస్సులో ఉత్తమ ఫ్లై యాష్ యుటిలైజేషన్ ప్లాంట్ అవార్డును అందుకుంది. .

ఉత్తమ పనితీరు కనబరిచిన ప్లాంట్ అవార్డును సింగరేణి డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి సత్యనారాయణరావుకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కె సింగ్, బెస్ట్ ఫ్లై యాష్ యుటిలైజేషన్ ప్లాంట్ అవార్డును ఎజిఎం కె.శ్రీనివాసులు అందుకున్నారు.

సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ కు జాతీయ స్థాయిలో రెండు అవార్డులు రావడం పట్ల సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేస్తూ ప్లాంట్ ఉద్యోగులు, అధికారులను అభినందించారు.

First Published:  5 March 2023 1:50 AM GMT
Next Story