Telugu Global
Telangana

తెలంగాణ కవులు, కళాకారులకోసం ప్రాజెక్ట్ కేసీఆర్

తెలంగాణ సాహిత్యం మీద గంభీరమైన చర్చ జరగాలన్న ఉద్దేశంతో తెలంగాణ సాహిత్య సభలు ఏర్పాటు చేశామన్నారు కవిత. పిల్లల్లో భాష మీద మక్కువ పెరగాలని, బాల సాహిత్యం ప్రచురణ చేసి స్కూల్ లైబ్రరీలో అందించే ప్రయత్నం చేస్తామ‌న్నారు.

తెలంగాణ కవులు, కళాకారులకోసం ప్రాజెక్ట్ కేసీఆర్
X

అబిడ్స్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో భారత జాగృతి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన సాహిత్య సభలు ముగిశాయి. ఈ సందర్భంగా కవులు, రచయితలు, సాహితీవేత్తలను సన్మానించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ కవులు, కళాకారుల కోసం ప్రాజెక్టు కేసీఆర్ - రిపాజిటరీ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారామె. తెలంగాణ చరిత్రను దేశవ్యాప్తంగా తెలియజేయాలని ఈ సందర్భంగా తీర్మానించామన్నారు. మహిళల కోసం ఫస్ట్ ఉమెన్, బై ఉమెన్ కార్యక్రమం చేపడతామన్నారు. పాఠశాలల్లో పిల్లలకు సాహిత్యం మీద పట్టుకోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలని ఈ సాహిత్య సభల్లో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు కవిత.


తెలంగాణ సాహిత్యం మీద గంభీరమైన చర్చ జరగాలన్న ఉద్దేశంతో తెలంగాణ సాహిత్య సభలు ఏర్పాటు చేశామన్నారు కవిత. పిల్లల్లో భాష మీద మక్కువ పెరగాలని, బాల సాహిత్యం ప్రచురణ చేసి స్కూల్ లైబ్రరీలో అందించే ప్రయత్నం చేస్తామ‌న్నారు. తెలంగాణలో బౌద్ధం, జైనం మీద పుస్తకాలు ప్రచురిస్తామని చెప్పారు.

అమరులకు ఘన నివాళులు..

అమ‌ర‌వీరుల‌ను పూజించే సంస్కృతి తమది అని, అవ‌మానించే సంస్కృతి తమది కాదని అన్నారు ఎమ్మెల్సీ కవిత. కొన్ని పత్రికలు ఇక్కడి జ్యోతులు కావు అని విమర్శించారు. ఆ పత్రికలు స‌మైక్య రాష్ట్రంలో అవ‌లంబించిన విధానాలనే ఇంకా పాటిస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. అమ‌రుల‌ను త‌ప్ప‌కుండా గౌర‌వించుకుంటామ‌న్నారు. మ‌న రాష్ట్రం గొప్ప రాష్ట్రం. మ‌న‌సున్న రాష్ట్రం అని పేర్కొన్నారు కవిత.


తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసిన అమరులకు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద కవిత నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ప్రజల్లో చైతన్యం నింపిన ఉద్యమ గీతాలను కళాకారులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మరోసారి అమరుల స్థూపం వద్ద పాడటం ఆనాటి ఉద్యమ స్పూర్తిని మరోసారి యాదికి చేసిందంటూ ట్వీట్ చేశారు.

First Published:  22 Jun 2023 4:59 PM GMT
Next Story