Telugu Global
Telangana

GSDP వృద్ధి రేటులో దేశంలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణ

2005-06 , 2021-22 మధ్య స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ (MoSPI) అందించిన డేటా ఆధారంగా, వ్యవసాయ ఆర్థికవేత్తలు దేశంలోని వివిధ రాష్ట్రాల పనితీరుపై ఒక నివేదికను రూపొందించారు.

GSDP వృద్ధి రేటులో దేశంలో  మూడో స్థానంలో ఉన్న తెలంగాణ
X

2005-06 నుండి 2021-22 వరకు తాజా డేటా ప్రకారం, తెలంగాణ రాష్ట్రం సగటున 8.6 శాతం స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) వృద్ధి రేటును నమోదు చేసింది, ఇది దేశంలోనే మూడవ స్థానం.

2005-06 , 2021-22 మధ్య స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ (MoSPI) అందించిన డేటా ఆధారంగా, వ్యవసాయ ఆర్థికవేత్తలు దేశంలోని వివిధ రాష్ట్రాల పనితీరుపై ఒక నివేదికను రూపొందించారు.

ఈ నివేదిక‌ ప్రకారం, జిఎస్‌డిపిలో 8.9 శాతం (AAGR)తో గుజరాత్ అగ్రస్థానంలో ఉండగా, ఉత్తరాఖండ్ 8.7 శాతంతో రెండో స్థానంలో, తెలంగాణ GSDP సగటు వార్షిక వృద్ధి రేటు (AAGR) 8.6 శాతంతొ మూడో స్థానంలో నిలిచాయి.

GSDPలో భారీ వృద్ధికి ప్రధానంగా తెలంగాణ వ్యవసాయ జిఎస్‌డిపిలో పెరుగుదల కారణమని చెప్పవచ్చు. తెలంగాణ జిఎస్‌డిపిలో వ్యవసాయ సగటు 6.4 శాతంతో మూడవ స్థానంలో ఉంది. వ్యవసాయం, అనుబంధ రంగాలలో మధ్యప్రదేశ్ అత్యధికంగా 7.3 శాతం AAGR తో మొదటి స్థాన‍ంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 6.6 శాతంతో రెండవ స్థానంలో ఉంది. జార్ఖండ్, తెలంగాణ 6.4 శాతంతో రెండవ స్థానంలో ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2018-19లో 9.5 శాతం, 2019-20లో 8.2 శాతం, 2020-21లో 2.4 శాతం, 2021-22లో 19.1 శాతం, 2022-23లో 15.6 శాతం జీఎస్‌డీపీ వృద్ధి రేటును నమోదు చేసింది. ‘‘2015-16 నుంచి తెలంగాణ జీఎస్‌డీపీకి సంబంధించిన సగటు వార్షిక వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకుంటే, తెలంగాణ‌ అగ్రస్థానంలో ఉండే అవకాశం ఉంది

పార్లమెంట్‌లో కేంద్రం సమర్పించిన గణాంకాల ప్రకారం, గత ఎనిమిదిన్నరేళ్లలో తెలంగాణ GSDP రెండింతలు పెరిగి దాదాపు రూ.13.27 లక్షల కోట్లకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2013-14 ఆర్థిక సంవత్సరంలో, రాష్ట్ర GSDP రూ. 5.05 లక్షల కోట్లుగా ఉంది. 2022-23లో రూ. 13.27 లక్షల కోట్లకు చేరుకుంది.

First Published:  27 Feb 2023 12:44 AM GMT
Next Story