Telugu Global
Telangana

వైద్య రంగం: టెలికన్సల్టేషన్ సేవల్లో తెలంగాణకు 3వ స్థానం

యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే 2022లో భాగంగా శనివారం వారణాసిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ అవార్డును రాష్ట్రానికి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేతా మొహంతి అవార్డును అందుకున్నారు.

వైద్య రంగం: టెలికన్సల్టేషన్ సేవల్లో తెలంగాణకు 3వ స్థానం
X

వైద్య రంగంలో తెలంగాణ అత్యుత్తమ సేవలు అందిస్తోంది. టెలికన్సల్టేషన్ సేవలలో పెద్ద రాష్ట్రాల విభాగంలో మూడవ స్థానంలో నిలిచి అవార్డును అందుకుంది.

యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే 2022లో భాగంగా శనివారం వారణాసిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ అవార్డును రాష్ట్రానికి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేతా మొహంతి అవార్డును అందుకున్నారు.

అక్టోబరు 12 నుంచి డిసెంబర్ 8 మధ్య జరిగిన టెలికన్సల్టేషన్ ప్రచారంలో తెలంగాణ 17,47,269 సంప్రదింపులు పూర్తి చేసి కేంద్రం నుంచి గుర్తింపు పొందింది. ర్యాంకింగ్స్‌లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లు వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి.

తెలంగాణ వ్యాప్తంగా 5,867 పిహెచ్‌సిలు, యుపిహెచ్‌సిలు, బస్తీ దవాఖానాలు, ఉప కేంద్రాలకు టెలికన్సల్టేషన్ ద్వారా 12 విభిన్న, ప్రత్యేక సేవలు అందించబడుతున్నాయి. ఏప్రిల్‌లో ఈ సేవలు ప్రారంభమైనప్పటి నుండి, మొత్తం 27,24,247 మంది వ్యక్తులు టెలికన్సల్టెన్సీ సేవలు పొందారు.

టెలికన్సల్టేషన్ సేవల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలవడం పట్ల వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు వైద్య, ఆరోగ్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు.

First Published:  10 Dec 2022 4:01 PM GMT
Next Story