Telugu Global
Telangana

వర్షాలతో జాగ్రత్త.. విద్యుత్ సంస్థ 7 సూచనలు

విద్యుత్‌ కి సంబంధించి ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా 1912, 100 నెంబర్లకు ఫోన్ చేయాలి. విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నెంబర్లు 73820 72104, 73820 72106, 73820 71574కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు.

వర్షాలతో జాగ్రత్త.. విద్యుత్ సంస్థ 7 సూచనలు
X

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కరెంటు షాక్ తో తండ్రీ కొడుకు, ఓ పెళ్లి కొడుకు చనిపోయిన ఉదాహరణలున్నాయి. వర్షాలతో కరెంటు షాక్ ముప్పు మరింత ఎక్కువ అవుతుందని హెచ్చరిస్తున్నారు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TSSPDCL) అధికారులు. ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ పంపిణీ, లైన్ల తాజా పరిస్థితిపై TSSPDCL సీఎండీ రఘుమారెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షాలు పడే సమయంలో సాధారణ ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ఈ జాగ్రత్తలు పాటించండి..

- వర్షాలు పడేటప్పుడు స్టే వైర్, విద్యుత్ లైన్ల కింద, ట్రాన్స్ ఫార్మర్ల దగ్గర నిలబడకూడదు. పశువులు, పెంపుడు జంతువులను విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలి.

- రోడ్లపై, వర్షపు నీటిలో విద్యుత్ తీగలు తెగి పడితే వాటికి దగ్గరగా వెళ్లకూడదు. వెంటనే విద్యుత్ సిబ్బందికి లేదా హెల్ప్‌ లైన్ నెంబర్లకు సమాచారం అందించాలి.

- లోతట్టు ప్రాంతాలు, అపార్ట్‌ మెంట్ సెల్లార్లలోకి వరదనీరు చేరితే వెంటనే విద్యుత్‌ సిబ్బందికి తెలపాలి.

- చెట్ల కొమ్మలు, వాహనాలు, ఇతర భవనాలపై తెగి పడ్డ తీగలు ఉంటే వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలి.

- భారీ గాలులు, వర్షం పడేటప్పుడు విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు ఉంటే.. ఇంట్లో ఉన్న విద్యుత్ ఉపకరణాలకు పవర్ సప్లై ఆపేయాలి.

- విద్యుత్ సరఫరాలో అంతరాయం ఫిర్యాదుల నమోదు కోసం కంట్రోల్ రూమ్‌ కు ఫోన్ చేసే సమయంలో కరెంటు బిల్లుపై ముద్రించిన USC నెంబర్‌ ను సిద్ధంగా ఉంచుకోవాలి.

- విద్యుత్‌ కి సంబంధించి ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా 1912, 100 నెంబర్లకు ఫోన్ చేయాలి. విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నెంబర్లు 73820 72104, 73820 72106, 73820 71574కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు.

First Published:  5 Sep 2023 8:23 AM GMT
Next Story