Telugu Global
Telangana

తెలంగాణ: ఈ యాసంగిలో 1.5 కోట్ల టన్నులకు చేరుకోనున్న‌ వరి దిగుబడి

తెలంగాణలో వరి సాగు ఈ యాసంగిలో గరిష్ట స్థాయికి చేరుకుంది. దాదాపు 54 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. యాసంగి సీజన్ లో ప్రతి సారీ ఆవరేజ్ గా 33.53 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. అయితే ఈ సారి 160 శాతం సాగు విస్తీర్ణం పెరిగింది.

తెలంగాణ: ఈ యాసంగిలో  1.5 కోట్ల టన్నులకు చేరుకోనున్న‌ వరి దిగుబడి
X

ఈ యాసంగి (రబీ) సీజన్‌లో తెల‍ంగాణలో రికార్డు స్థాయిలో 1.5 కోట్ల టన్నులకు పైగా వరిధాన్యం ఉత్పత్తి జరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కేంద్రం ఇంత పెద్ద మొత్తంలో వరిధాన్యాన్ని సేకరించడానికి సిద్దంగా లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారే అవకాశం ఉంది.

తెలంగాణలో వరి సాగు ఈ యాసంగిలో గరిష్ట స్థాయికి చేరుకుంది. దాదాపు 54 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. యాసంగి సీజన్ లో ప్రతి సారీ ఆవరేజ్ గా 33.53 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. అయితే ఈ సారి 160 శాతం సాగు విస్తీర్ణం పెరిగింది. 2022-23 వానకాలం (ఖరీఫ్) సీజన్‌లో 64.54 లక్షల ఎకరాల్లో, 2021-22 యాసంగి సీజన్‌లో 35.84 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు.

ఈ యాసంగిలో వానకాలం సీజన్ కంటే తక్కువ సాగు విస్తీర్ణం ఉన్నప్పటికీ, యాసంగిలో అధిక దిగుబడి రావడంతో వానకాలం కంటే (సుమారు 1.48 కోట్ల టన్నులు) వరి ఉత్పత్తి ఎక్కువగా వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వానాకాలం పంట ఎకరాకు 20 టన్నులు రాగా, యాసంగి పంటలో ఎకరాకు 26 టన్నుల దిగుబడి వస్తుంది.

యాసంగి సీజన్‌లో అధిక దిగుబడి రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారబోతుంది. ఎందుకంటే రాష్ట్రంలోని అధిక ఉష్ణోగ్రత పరిస్థితుల వల్ల ధాన్యం ముక్కలయ్యే అవకాశం ఉంది. ఈ ధాన్యాన్ని బాయిల్ చేయాల్సి వస్తుంది. బాయిల్డ్ బియ్యం కొనడానికి కేంద్రం సిద్దంగా లేదు.

బియ్యానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ సీజన్‌లో బాయిల్డ్‌ రైస్‌ను అనుమతించాలని కేంద్రాన్ని కోరుతున్నామని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు

First Published:  1 March 2023 4:11 AM GMT
Next Story