Telugu Global
Telangana

తెలంగాణ నూతన సచివాలయం.. ఏయే ఫ్లోర్లలో ఏయే శాఖలు?

6వ ఫ్లోర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం, సీఎంవో, సీఎం కార్యదర్శులు ఉంటారు. 3వ ఫ్లోర్ లో కేటీఆర్ కార్యాలయం, 2వ ఫ్లోర్ లో హరీశ్ రావు కార్యాలయం ఉంటాయి.

తెలంగాణ నూతన సచివాలయం.. ఏయే ఫ్లోర్లలో ఏయే శాఖలు?
X

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సెక్రటేరియెట్ లో మొత్తం ఆరు ఫ్లోర్లలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల కార్యాలయాలు, వివిధ ప్రభుత్వ శాఖల ఆఫీసులు..ఏయే ఫ్లోర్లలో ఏయే శాఖలు ఉంటాయంటే..

Ground Floor:

ఎస్సీ సంక్షేమ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, రెవెన్యూ, కార్మిక, ఉపాధి కల్పన శాఖలు. ఇందులో ‘A’ వింగ్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ’B‘ వింగ్ లో మంత్రి మల్లారెడ్డి ఉంటారు.

1st Floor:

హోం, గ్రామీణాభివృద్ది, విద్యా, పంచాయతీరాజ్‌ శాఖలు.. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ‘A’ వింగ్ లో, సబితా ఇంద్రారెడ్డి ’B‘ వింగ్ లో, ఎర్రబెల్లి దయాకర్ రావు ’D‘ వింగ్ లో..

2nd Floor:

వైద్యారోగ్యం, విద్యుత్‌, పశు సంవర్థక, ఆర్థిక శాఖలు.. హరీశ్ రావు ’A‘ వింగ్ లో, జగదీశ్ రెడ్డి ’B‘ వింగ్ లో, తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ’D‘ వింగ్ లో..

3rd Floor:

మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, పురపాలక, పట్టణాభివృద్ది, ప్లానింగ్‌, ఐటీ, వ్యవసాయ, సహకార, పరిశ్రమలు, వాణిజ్య శాఖలు.. కేటీఆర్‌ ’A‘ వింగ్ లో, సత్యవతి రాథోడ్‌ ’B‘ వింగ్ లో, నిరంజన్ రెడ్డి ’D‘ వింగ్ లో..

4th Floor:

పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, యువజన, పర్యాటక, బీసీ సంక్షేమ, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక, నీటి పారుదల, న్యాయశాఖలు.. ఇంద్రకరణ్ రెడ్డి ’A‘ వింగ్ లో, శ్రీనివాస్‌ గౌడ్‌ ’B‘ వింగ్ లో, గంగుల కమలాకర్ ’D‘ వింగ్ లో..

5th Floor:

రవాణా, రహదారులు, సాధారణ పరిపాలన, భవనాల శాఖలు.. ప్రశాంత్ రెడ్డి ’A‘ వింగ్ లో, పువ్వాడ అజయ్‌ ’D‘ వింగ్ లో..

6th Floor:

ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం, సీఎంవో, సీఎం కార్యదర్శులు.

First Published:  30 April 2023 8:03 AM GMT
Next Story