Telugu Global
Telangana

తెలంగాణ మంత్రులకు అదనపు బాధ్యతలు.. ఎందుకంటే..?

తెలంగాణ అసెంబ్లీ తొలిరోజు సమావేశాలు సంతాప తీర్మానంతో ముగియగా, రెండోరోజు వర్షాలు, వరదలపై చర్చ జరగబోతోంది. ఉభయ సభల్లోనూ మొదట ప్రశ్నోత్తరాలు చేపడతారు.

తెలంగాణ మంత్రులకు అదనపు బాధ్యతలు.. ఎందుకంటే..?
X

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రులకు అదనపు బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు వారు ఈ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈమేరకు అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు బులిటెన్‌ విడుదల చేశారు. ఉభయ సభల్లో ఆయా శాఖలకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తినప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రులకు అప్పగించారు.

మంత్రి - అదనపు బాధ్యత..

కేటీఆర్‌ - గనులు, భూగర్భ వనరులు, సమాచార పౌరసంబంధాలు

హరీష్ రావు - నీటిపారుదలశాఖ, సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, ప్రణాళికశాఖ

వేముల ప్రశాంత్ రెడ్డి - రెవెన్యూ

తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ - వాణిజ్య పన్నులశాఖ

ఈ రోజు సమావేశాలు ఇలా..

తెలంగాణ అసెంబ్లీ తొలిరోజు సమావేశాలు సంతాప తీర్మానంతో ముగియగా, రెండోరోజు వర్షాలు, వరదలపై చర్చ జరగబోతోంది. ఉభయ సభల్లోనూ మొదట ప్రశ్నోత్తరాలు చేపడతారు. అనంతరం స్వల్పకాలిక చర్చలో భాగంగా శాసన సభలో భారీ వర్షాలు, వరదలు ప్రభావంపై చర్చ జరుగుతుంది. తర్వాత ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. ఈరోజు పలు బిల్లులు కూడా సభలో ప్రవేశపెట్టబోతున్నారు. శాసన మండలిలో విద్య, వైద్యంపై చర్చిస్తారు.

First Published:  4 Aug 2023 4:41 AM GMT
Next Story