Telugu Global
Telangana

వ‌రల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ ‘స్కై సోర‌ర్’ను లాంచ్ చేసిన కేటీఆర్

తెలుగు వారికి మరింత వృద్ధి చెందే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, వాటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు కేటీఆర్.

వ‌రల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ ‘స్కై సోర‌ర్’ను లాంచ్ చేసిన కేటీఆర్
X

అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ వాషింగ్టన్ డీసీలో వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ (WTITC) ‘స్కై సోర‌ర్’ లాంచ్ చేశారు. అమెరికాలో ఉన్న తెలుగు టెకీలకు శుభాకాంక్షలు తెలిపారు. త‌మ సంస్థలు, నైపుణ్యాల ద్వారా ప్రపంచ‌వ్యాప్తంగా గుర్తింపు పొందిన మ‌న ఐటీ నిపుణులు స్టార్టప్‌ ల వైపు మొగ్గు చూపాల‌ని, స్వదేశంలో పెట్టుబ‌డులు పెట్టడానికి ముందుకు రావాలని సూచించారు. తెలుగు వారికి మరింత వృద్ధి చెందే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, వాటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు కేటీఆర్.

ప్రపంచ‌ తెలుగు స‌మాచార సాంకేతిక మండ‌లి(WTITC)కి అమెరికాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు ఐటీ సంస్థల‌కు ఇదే వేదిక. వాషింగ్టన్ డీసీలో ఉన్న ఈ WTITCలో స్కై సోరర్ ని లాంఛ్ చేశారు మంత్రి కేటీఆర్. ఫ్లైయింగ్ హై విత్ WTITC అనే థీమ్ తో దీన్ని రూపొందించారు. ఈ స్కై సోర‌ర్ ద్వారా WTITC కార్యక‌లాపాల గురించి మరింత ప్రచారం జరుగుతుంది. WTITC ని ఏర్పాటు చేసిన చైర్మన్ సందీప్ కుమార్ మ‌ఖ్తల కు కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు.

ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగు టెక్నోక్రాట్లను ఒక‌తాటిపైకి తెచ్చేందుకు దీన్ని ఏర్పాటు చేశామని.. తెలుగు రాష్ట్రాలకు పెట్టుబ‌డులు తీసుకురావడం, ఎంట్రప్రెన్యూర్‌ షిప్, స్టార్టప్‌ లను ప్రోత్సహించ‌డం, వివిధ భాగ‌స్వామ్య ప‌క్షాల మ‌ధ్య స‌మ‌న్వయం ల‌క్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు WTITC చైర్మన్ సందీప్ మఖ్తల. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

First Published:  20 May 2023 9:58 AM GMT
Next Story