Telugu Global
Telangana

తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం పనులు వేగవంతం చేయాలి

హుస్సేన్ సాగర్ సమీపంలో నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని బుధవారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా 24 గంటలూ పనులు జరిగేలా సిబ్బందిని పెంచి పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టు ఏజెన్సీని ఆదేశించారు.

తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం పనులు వేగవంతం చేయాలి
X

హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్తూపం పనుల వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్న సమయం కన్నా ముందుగానే స్తూపాన్ని సిద్దం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

హుస్సేన్ సాగర్ సమీపంలో నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని బుధవారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా 24 గంటలూ పనులు జరిగేలా సిబ్బందిని పెంచి పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టు ఏజెన్సీని ఆదేశించారు.

ప్రస్తుతం, స్మారక చిహ్నం చుట్టూ స్టెయిన్‌లెస్ స్టీల్ షీట్లను బిగించే పనులు పూర్తయ్యాయి. వివిధ దశల్లో ఉన్న ప్రధాన ద్వారం, ఫ్లోరింగ్, ఫౌంటెన్ ఏరియా, తెలంగాణ తల్లి విగ్రహం, ల్యాండ్‌స్కేపింగ్ ఏరియా, మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆడిటోరియం, రెస్టారెంట్‌కు సంబంధించిన వివిధ పనులను మంత్రి పరిశీలించారు.

First Published:  22 Dec 2022 3:19 AM GMT
Next Story