Telugu Global
Telangana

తెలంగాణ మలిదశ పోరాటం.. కేసీఆర్‌కు స్పూర్తి ఆయనే : తన్నీరు హరీశ్ రావు

మలిదశ పోరాటం కారణంగానే తెలంగాణ ఏర్పడింది. ఆ పోరాటం చేయడానికి కేసీఆర్‌కు స్పూర్తినిచ్చింది, మార్గదర్శనం చేసింది కోండా లక్ష్మణ్ బాపూజీ అని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు.

తెలంగాణ మలిదశ పోరాటం.. కేసీఆర్‌కు స్పూర్తి ఆయనే : తన్నీరు హరీశ్ రావు
X

మలిదశ పోరాటం కారణంగానే తెలంగాణ ఏర్పడింది. ఆ పోరాటం చేయడానికి కేసీఆర్‌కు స్పూర్తినిచ్చింది, మార్గదర్శనం చేసింది కోండా లక్ష్మణ్ బాపూజీ అని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేటలో పద్మశాలీ సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ కాంగ్య విగ్రహాన్ని ఆదివారం హరీశ్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ తొలి దశ ఉద్యమ సమయంలో తన పదవిని బాపూజీ గడ్డిపోచలా త్యాగం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ సాధించే వరకు ఎలాంటి పదవిని చేపట్టనని బాపూజీ శపథం చేశారన్నారు. చాకలి ఐలమ్మ భర్త నర్సింహ్మను జైలుకు పంపితే.. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా బాపూజీ వాదించారని హరీశ్ అన్నారు.

పేదల కోసం అప్పట్లో కమ్యూనిస్టులు తుపాకులతో కొట్లాడితే, బాపూజీ నల్ల కోటుతో కొట్లాడారని చెప్పారు. 1956లో హైదరాబాద్ స్టేట్‌ను ఏపీలో కలపడాన్ని బాపూజీ తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు. ఆయన చేసిన సేవకు గాను సహకార రత్న బిరుదుతో సత్కరించారని చెప్పారు. మలిదశ పోరాటానికి సిద్దపడిన కేసీఆర్‌ను బాపూజీ అభినందించారని హరీశ్ అన్నారు. బాపూజీ చూపిన దారిలోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నదని, పద్మశాలీ సమాజానికి, చేనేత కార్మికుల తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.

బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు చేసింది ఏమీ లేదని.. ఉన్న పథకాలు అన్నీ రద్దు చేసి.. పద్దులు మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డును ఏర్పాటు చేస్తే.. బీజేపీ ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది జులైలో రద్దు చేసిందని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా హ్యాండీ క్రాఫ్ట్ బోర్డు, పవర్ లూమ్ బోర్డులను కూడా రద్దు చేసి.. అందులో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించిన ఘనత బీజేపీకి చెందుతుందని అన్నారు. 8 పరిశోధనా కేంద్రాలను రద్దు చేసి ఉద్యోగులను తొలగించి.. కార్మికుల పొట్ట కొట్టిందని బీజేపీపై మండి పడ్డారు.

కార్మికులకు అందిస్తున్న 4 శాతం క్రిప్ట్ ఫండ్‌ను రద్దు చేసిన ఘనత బీజేపీదే అన్నారు. ఐసీఐసీఐ లాంబార్డ్, బంకర్ బీమాలతో పాటు కొంకణా షేడ్ స్కీమ్‌లను కేంద్ర తొలగించిందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని పథకాలు, రాయితీలు, స్కీములు తొలగించినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆదుకుందని చెప్పారు. చేనేత కార్మికుల రుణలు మాఫీ చేసి.. క్రాఫ్ట్ పథకాన్ని పునరుద్దరించిదని.. ఈ ఘనత సీఎం కేసీఆర్‌దే అని హరీశ్ రావు అన్నారు.


First Published:  28 Aug 2022 1:50 PM GMT
Next Story