Telugu Global
Telangana

తెలంగాణ పాల‌న‌ను ప్ర‌శంసించిన నీతి ఆయోగ్‌

మానవ వనరుల వినియోగం, పెట్టుబడి, వృత్తిపరమైన నైపుణ్య సిబ్బంది, వాణిజ్య వాతావరణం, భద్రత, న్యాయపరమైన వాతావరణం.. వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటారు. వీటిలో తెలంగాణ ఆశించిన స్థాయికంటే మెరుగైన ఫలితాలను కనబరుస్తోంది.

తెలంగాణ పాల‌న‌ను  ప్ర‌శంసించిన నీతి ఆయోగ్‌
X

ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ లో టాప్-2 తెలంగాణ..

ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021జాబితాను నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఇన్నోవేషన్ ఇండెక్స్ లో వివిధ కేటగిరీల్లో తెలంగాణ టాప్ ప్లేస్‌ల‌లో ఉండటం విశేషం. మేజర్ స్టేట్స్ విభాగంలో కర్నాటక మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ప్రారంభకుల విభాగంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. పనితీరు విభాగంలో తెలంగాణది ఫస్ట్ ప్లేస్. మొత్తంగా అన్ని విభాగాల్లో తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉండటం విశేషం. బిజినెస్ ఎన్విరాన్ మెంట్ విభాగంలో దేశంలోనే అత్యథిక స్కోర్ తెచ్చుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. నీతి ఆయోగ్ 35 పాయింట్లను ఇందులో టార్గెట్ గా పెట్టగా.. తెలంగాణ 36.54 పాయింట్లు సాధించడం విశేషం.



ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంక్ లను ప్రకటించిన నీతి ఆయోగ్.. తెలంగాణ ప్రతిభను ప్రశంసించింది. అగ్రశ్రేణి ఐటీ సంస్థల గమ్యస్థానాలలో తెలంగాణ ఒకటి అని తేల్చింది. MNCలు స్టార్టప్‌ ల సూచీలలో కూడా తెలంగాణ మంచి పనితీరు కనబరిచింది. ఐసీటీ ల్యాబ్ లు ఉన్న పాఠశాలలు గతంలో 17శాతం ఉండగా, ఇప్పుడవి 35శాతానికి చేరుకున్నాయి. ప్రైవేట్ R&D యూనిట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, నాలెడ్జ్ వర్కర్లను సృష్టించే సామర్థ్యం తెలంగాణకు ఉందని చెప్పింది నీతిఆయోగ్. పేటెంట్లు, ట్రేడ్‌ మార్క్‌ లు, ఇండస్ట్రియల్ డిజైన్ల విషయంలో గతంతో పోల్చి చూస్తే స్పష్టంగా పెరుగుదల కనిపిస్తోందని చెప్పింది. కేవలం స్టార్టప్ ల సంఖ్య 4,900 నుండి 9,000కి పెరగడం విశేషం.

ఇన్నోవేషన్ ఇండెక్స్ లెక్కకట్టేటప్పుడు ఆరు ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. మానవ వనరుల వినియోగం, పెట్టుబడి, వృత్తిపరమైన నైపుణ్య సిబ్బంది, వాణిజ్య వాతావరణం, భద్రత, న్యాయపరమైన వాతావరణం.. వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటారు. వీటిలో తెలంగాణ ఆశించిన స్థాయికంటే మెరుగైన ఫలితాలను కనబరుస్తోంది. తెలంగాణలో మెరుగైన ఇండస్ట్రియల్ పాలసీ ఉండటం, ఐటి ఇంక్యుబేటర్ల వంటి ప్రయత్నాలు విజయవంతం కావడంతో ఇన్నోవేషన్ ఇండెక్స్ లో తెలంగాణ టాప్ ప్లేస్ లో నిలబడింది.

First Published:  21 July 2022 9:15 AM GMT
Next Story