Telugu Global
Telangana

బీజేపీ పిటిషన్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు

బీజేపీ నేతలకు సిట్ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. దీనిపై శనివారం విచారణ చేపట్టిన హైకోర్టు బీజేపీ విజ్ఞప్తిని తిరస్కరించింది.

బీజేపీ పిటిషన్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు
X

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల కుట్ర కేసు విచారణలో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్, లాయర్ శ్రీనివాస్‌లను 21న సిట్ ముందు హాజరవ్వాలని నోటీసులు జారీ అయ్యాయి. ఒక వేళ గైర్హాజరు అయితే అరెస్టు చేస్తామని సిట్ నోటీసులో పేర్కొంది. దీనిపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో స్టే కోసం పిటిషన్ వేశారు.

బీజేపీ నేతలకు సిట్ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. దీనిపై శనివారం విచారణ చేపట్టిన హైకోర్టు బీజేపీ విజ్ఞప్తిని తిరస్కరించింది. బీఎల్ సంతోశ్‌ను విచారించవచ్చని, అయితే తదుపరి ఆదేశాలు అందించే వరకు మాత్రం అరెస్టు చేయవద్దని ఆదేశించింది. మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటనలో ప్రధాన నిందితులకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని, ఇప్పటికే సిట్ విచారణలో వెల్లడైంది. అయితే ఆడియో, వీడియో ఫుటేజీలో వెల్లడైన విషయాలను ఖరారు చేసుకోవడానికి సిట్ పలువురికి నోటీసులు జారీ చేస్తోంది.

మరోవైపు విచారణకు ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని సిట్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో ఢిల్లీలోని ఒక వ్యక్తికి సంబంధాలు ఉన్నాయని, అతడికి నోటీసులు పంపితే.. వాటిని ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు సుముఖంగా లేరని కోర్టుకు తెలిపింది. ఈ కేసు దర్యాప్తులో ఆటంకాలు కలిగించకుండా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ సిట్ కోరింది. దీనిపై ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను డిసెంబర్ 12కి వాయిదా వేసింది.

First Published:  19 Nov 2022 10:00 AM GMT
Next Story