Telugu Global
Telangana

దొంగ చేతికే తాళం వెళ్లిందా?- సీబీఐకి ఎమ్మెల్యేల ఎర కేసు

సీబీఐకి అప్పగిస్తే కేసు నీరుగారిపోతుందని వాదించారు. దర్యాప్తు పురోగతిలో ఉన్నందున ఈ దశలో సీబీఐకి అప్పగించడం సరికాదని విన్నవించారు. అయితే ఏజీ వాదనను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు

దొంగ చేతికే తాళం వెళ్లిందా?- సీబీఐకి ఎమ్మెల్యేల ఎర కేసు
X

తెలంగాణలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కోసం కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ కేసు దర్యాప్తున‌కు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టుకు వెళ్లారు.

తమపై దురుద్దేశంతో కేసు పెట్టారని, ఈ కేసును విచారించే అధికారం ఏసీబీకి తప్ప సిట్‌కు లేదంటూ వాదించారు. సంబంధం లేకున్నా బీజేపీ పేరు చెప్పాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారని, సిట్ దర్యాప్తుతో తమకు న్యాయం జరగదని నిందితులు వాదించారు. నిందితులతో పాటు బీజేపీ కూడా సిట్‌ దర్యాప్తుపై నమ్మకం లేదంటూ పిటిషన్ వేసింది. నిందితుల వాదనను ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వ్యతిరేకించారు.

సీబీఐకి అప్పగిస్తే కేసు నీరుగారిపోతుందని వాదించారు. దర్యాప్తు పురోగతిలో ఉన్నందున ఈ దశలో సీబీఐకి అప్పగించడం సరికాదని విన్నవించారు. అయితే ఏజీ వాదనను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. కేసును సీబీఐకి అప్పగించింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తున‌కు సంబంధించిన వివరాలను సీబీఐకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందే బీజేపీ. అలాంటప్పుడు బీజేపీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉండగా.. ఈ కేసును కేంద్రం కనుసన్నల్లో పనిచేసే సీబీఐకి అప్పగించడం వల్ల కేసు నీరుగారిపోయే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

First Published:  26 Dec 2022 11:39 AM GMT
Next Story