Telugu Global
Telangana

బలహీన వర్గాల అభివృద్దికి రూ.2626.04 కోట్లు ఖర్చు చేసిన తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సామాజిక-ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ (ESS) కింద 1,62,444 మంది ఎస్సీ లబ్ధిదారులకు పరిశ్రమలు, సేవలు, వ్యాపారం, రవాణా రంగాల కింద 2014 నుండి ఇప్పటీ వరకు రూ. 2,029.78 కోట్ల సబ్సిడీ అందించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ESS కింద రూ.100 కోట్లు కేటాయించింది.

బలహీన వర్గాల అభివృద్దికి రూ.2626.04 కోట్లు ఖర్చు చేసిన తెలంగాణ ప్రభుత్వం
X

బలహీన వర్గాల స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం పట్టుదలగా పని చేస్తున్నది. ఆయా వర్గాల కోసం నిధుల కేటాయింపులకు ఏమాత్రం వెనకాడటం లేదు. . 2014-15 నుండి 2022-23 వరకు (జనవరి 2023 వరకు) వివిధ పథకాల ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర బలహీన వర్గాల ఆర్థిక అభ్యున్నతికి సుమారు రూ.2626.04 కోట్లు ఖర్చు చేసింది

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సామాజిక-ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ (ESS) కింద 1,62,444 మంది ఎస్సీ లబ్ధిదారులకు పరిశ్రమలు, సేవలు, వ్యాపారం, రవాణా రంగాల కింద 2014 నుండి ఇప్పటీ వరకు రూ. 2,029.78 కోట్ల సబ్సిడీ అందించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ESS కింద రూ.100 కోట్లు కేటాయించింది.

ఇది కాకుండా, షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎస్సీ యువత కోసం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. గత తొమ్మిదేళ్లలో సుమారు 17,240 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు రూ.104.62 కోట్లు ఖర్చు చేశారు. చాలా మంది అభ్యర్థులు డెల్, CISCO, డెలాయిట్, TCS, L&T తదితర‌ ప్రసిద్ధ కంపెనీలతోపాటు అనేక కార్పొరేట్ ఆసుపత్రులలో ప్లేస్‌మెంట్‌లు పొందారు.

2022-23లో రూ.135.87 కోట్ల పెట్టుబడితో 20,888 మంది ఎస్టీ లబ్ధిదారులు ESS, సీఎం గిరివికాసం, గ్రామీణ రవాణా, గిరిజన కళాకారులు, ఎంఎస్‌ఎంఈలు, ఎస్టీ నైపుణ్య శిక్షణ తదితర పథకాల ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి ESS కింద రూ.323.45 కోట్లు, సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ కింద రూ.50. కోట్లు కేటాయించింది.

అదేవిధంగా, బిసి కార్పొరేషన్, అత్యంత వెనుకబడిన తరగతులు, 11 బిసి ఫెడరేషన్‌ల కింద, వాషర్ మెన్ & నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్‌తో సహా, మొత్తం 1,75,647 మంది లబ్ధిదారులకు 2014-15 నుండి జనవరి 2023 వరకు 460.39 కోట్ల రూపాయల సబ్సిడీని అందించారు.

2

First Published:  19 Feb 2023 3:19 PM GMT
Next Story