Telugu Global
Telangana

వ్యర్థాల నుంచి ఇంధన ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తోన్న తెలంగాణ ప్రభుత్వం

2021లో, జవహర్‌నగర్‌లో 19.8 మెగావాట్ల ప్లాంట్ ప్రారంభించారు. తరువాత దానిని 24 మెగావాట్ల ప్లాంట్‌గా అప్‌గ్రేడ్ చేశారు. ఈ ప్లాంట్ లో రోజుకు 1300 నుండి 1500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వినియోగిస్తున్నారు.

వ్యర్థాల నుంచి ఇంధన ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తోన్న తెలంగాణ ప్రభుత్వం
X

2021లో జవహర్‌నగర్‌లో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వేస్ట్ టు ఎనర్జీ (డబ్ల్యుటిఇ) ప్లాంట్‌ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వ్యర్థాల నుండి 100 మెగావాట్ల పవర్ ను ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టింది.

2021లో, జవహర్‌నగర్‌లో 19.8 మెగావాట్ల ప్లాంట్ ప్రారంభించారు. తరువాత దానిని 24 మెగావాట్ల ప్లాంట్‌గా అప్‌గ్రేడ్ చేశారు. ఈ ప్లాంట్ లో రోజుకు 1300 నుండి 1500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వినియోగిస్తున్నారు.

ఈ ఏడాది జనవరి నాటికి ప్లాంట్ 6.35 లక్షల టన్నుల వ్యర్థాలను వినియోగించి 225 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ఈ ప్లాంట్ ను ఇప్పుడు 48 మెగావాట్లకు అప్ గ్రేడ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ లో రోజుకు 2,500 MT నుండి 3,000 MT వ్యర్థాలను వినియోగిస్తున్నారు.

దీనికి తోడు దుండిగల్‌లో 1000 నుంచి 1200 మెట్రిక్‌ టన్నుల వ్యర్థ వినియోగ సామర్థ్యంతో మరో 14.5 మెగావాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ ప్లాంట్ ఆ ప్రాంతంలో దుర్వాసనను తగ్గించి, నేల, నీటి కాలుష్యాన్ని నిరోధిస్తుంది. ఇది మరో 18 నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది.

సంగారెడ్డి జిల్లా ప్యారానగర్‌లో 150 ఎకరాల ప్రభుత్వ భూమిలో 15 మెగావాట్ల సామర్థ్యంతో మరో ప్లాంట్, బీబీ నగర్‌లో 11 మెగావాట్లు, యాచారంలో 14 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

ప్యారానగర్‌లో ప్రతిపాదిత ప్లాంట్ లో 800 MTల నుండి 1000 MTల వరకు వ్యర్థాలను వినియోగిస్తారు.

పైన పేర్కొన్న అన్ని ప్లాంట్లు పనిచేస్తే, వాటి ద్వారా తెలంగాణ 100 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తుందని సీనియర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప మెంట్ అధికారి తెలిపారు.

జిల్లాల్లో సమర్థవంతంగా వ్యర్థాల నిర్వహణ కోసం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తొమ్మిది క్లస్టర్లలో బయో మైనింగ్‌ను చేపడుతోంది. వీటిలో వరంగల్, కరీంనగర్ రెండు క్లస్టర్లలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌లను ప్రతిపాదించారు.

First Published:  20 Feb 2023 12:49 AM GMT
Next Story