Telugu Global
Telangana

సైపుద్దీన్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వ సాయం

కేటీఆర్ హామీ ప్రకారం ఈరోజు ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. సైపుద్దీన్ భార్యకు ఉద్యోగం ఇవ్వడంతోపాటు డబుల్ బెడ్ రూమ్ ఇంటిని కూడా మంజూరు చేసింది. బీఆర్ఎస్ పార్టీ తరపున 6 లక్షల రూపాయల ఆర్థిక సాయన్ని కూడా వారికి అందించారు.

సైపుద్దీన్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వ సాయం
X

జైపూర్-ముంబై రైలులో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో మృతి చెందిన హైదరాబాద్ వాసి సైపుద్దీన్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. సైపుద్దీన్ భార్య అంజుమ్ షాహీన్ ను కులీకుతుబ్ షా అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలో ఆఫీస్ సబార్డినేట్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వు కాపీలను మంత్రి కేటీఆర్ బాధిత కుటుంబానికి అందజేశారు. వారి కష్టాలను ప్రభుత్వానికి తెలియజేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


హైదరాబాద్ ఏసీ గార్డెన్స్ లో నివాసం ఉండే సైపుద్దీన్ మొబైల్ ఫోన్ టెక్నీషియన్ గా పనిచేస్తుండేవారు. ఆయనకు భార్య, పిల్లలున్నారు. జైపూర్-ముంబై రైలులో ప్రయాణిస్తుండగా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అకారణంగా జరిపిన కాల్పుల్లో సైపుద్దీన్ మృతి చెందారు. ఆ రైలులో మొత్తం నలుగురిని హతమార్చాడు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్. అయితే సైపుద్దీన్ కుటుంబ దీన స్థితిని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

కేటీఆర్ హామీ ప్రకారం ఈరోజు ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. సైపుద్దీన్ భార్యకు ఉద్యోగం ఇవ్వడంతోపాటు డబుల్ బెడ్ రూమ్ ఇంటిని కూడా మంజూరు చేసింది. బీఆర్ఎస్ పార్టీ తరపున 6 లక్షల రూపాయల ఆర్థిక సాయన్ని కూడా వారికి అందించారు. అసెంబ్లీ ఆవరణలో రూ.6లక్షల చెక్కుని, ఉద్యోగ నియామక పత్రాన్ని, జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కేటాయింపు ఆర్డర్ ని అందజేశారు. మంత్రి కేటీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

First Published:  5 Aug 2023 4:19 PM GMT
Next Story