Telugu Global
Telangana

నాంపల్లి ఘటన మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

ఈ ప్రమాదానికి కెమికల్‌ డబ్బాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న గ్యారేజ్‌లో కారు రిపేరు చేస్తుండగా మంటలు చెలరేగాయని, అవి అక్కడే ఉన్న డీజిల్, కెమికల్‌ డ్రమ్ములకు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని తెలుస్తోంది.

నాంపల్లి ఘటన మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
X

నాంపల్లి ఘటన మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

నాంపల్లిలో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో మృతులకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ సోమవారం వెల్లడించారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని స్వయంగా సందర్శించిన మంత్రి కేటీఆర్‌.. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ మృతుల కుటుంబాలను ఆదుకుంటామని స్పష్టం చేశారు.

పెరుగుతున్న మృతుల సంఖ్య..

ఈ ప్రమాదంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో చెలరేగిన మంటలు నాలుగంతస్తులకు అంటుకోవడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. తొలుత ఏడుగురు మృతిచెందగా, ఆ సంఖ్య తాజాగా తొమ్మిదికి చేరింది. మరో 21 మంది గాయాలపాలయ్యారు. వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వారందరినీ ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిసున్నారు. క్షతగాత్రులను కాపాడేందుకు వైద్య సిబ్బంది నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు.

కెమికల్‌ డబ్బాల వల్లే..

ఈ ప్రమాదానికి కెమికల్‌ డబ్బాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న గ్యారేజ్‌లో కారు రిపేరు చేస్తుండగా మంటలు చెలరేగాయని, అవి అక్కడే ఉన్న డీజిల్, కెమికల్‌ డ్రమ్ములకు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని తెలుస్తోంది.ఈ ప్రమాదానికి కెమికల్‌ డబ్బాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న గ్యారేజ్‌లో కారు రిపేరు చేస్తుండగా మంటలు చెలరేగాయని, అవి అక్కడే ఉన్న డీజిల్, కెమికల్‌ డ్రమ్ములకు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనలో గ్యారేజీలో ఉన్న పలు వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో కాలిపోయిన డబ్బాలను 30గా గుర్తించారు. కాలిపోకుండా ఉన్నవి మరో 100 ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ కెమికల్‌ డబ్బాలు ప్రమాదానికి గురైన ఇంటి యజమాని రమేష్‌ జైశ్వాల్‌కు చెందినవిగా భావిస్తున్నారు. రమేష్‌కు కెమికల్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం రమేష్‌ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు.

First Published:  13 Nov 2023 9:59 AM GMT
Next Story