Telugu Global
Telangana

గవర్నర్ ప‌ద‌వికి తమిళిసై రాజీనామా.. ఎంపీగా పోటీ..?

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానని ఫిబ్రవరిలోనే ప్రకటించారు తమిళి సై. అయితే ప్రధాని మోడీ, అమిత్ షా సూచనల మేరకు నడుచుకుంటానని తెలిపారు.

గవర్నర్ ప‌ద‌వికి తమిళిసై రాజీనామా.. ఎంపీగా పోటీ..?
X

తమిళిసై సౌందరరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్‌ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు రాజీనామా చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నుంచి ఆమె బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని సమాచారం.

తమిళి సై 2019 వరకు తమిళనాడు బీజేపీ స్టేట్ చీఫ్‌గా వ్యవహరించారు. 2019 సెప్టెంబర్‌లో ఆమెను తెలంగాణకు గవర్నర్‌గా పంపింది కేంద్రం. ఇక పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కిరణ్‌ బేడి తప్పుకోవడంతో తమిళిసైకి ఆ బాధ్యతలు కూడా అదనంగా అప్పగించారు.

కాంగ్రెస్ కురువృద్ధుడు కుమారి అనంతన్ కుమార్తె తమిళి సై. గతంలో ఆయన లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. ఇక గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టకముందు దాదాపు దాదాపు 20 ఏళ్లకుపైగా ఆమె బీజేపీలో పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తూత్తుకూడి నుంచి పోటీ చేసిన తమిళి సై.. డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో భారీ తేడాతో ఓడిపోయారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానని ఫిబ్రవరిలోనే ప్రకటించారు తమిళి సై. అయితే ప్రధాని మోడీ, అమిత్ షా సూచనల మేరకు నడుచుకుంటానని తెలిపారు. పుదుచ్చేరి నుంచి ఆమె లోక్‌సభ స్థానం నుంచి ఆమె పోటీ చేస్తారని తెలుస్తోంది.

First Published:  18 March 2024 6:25 AM GMT
Next Story