Telugu Global
Telangana

ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై తప్పుడు సమాచారం ఇచ్చారు... అధికారులపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం

నిందితుడిని కాపాడేందుకు మొదట ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించిన‌ గవర్నర్ తమిళిసై ఈ మేరకు కాళోజీ హెల్త్ యూనిర్సిటీ వీసీకి లేఖ రాశారు.

ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై తప్పుడు సమాచారం ఇచ్చారు... అధికారులపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం
X

సీనియర్ మెడికో సైఫ్ వేధింపులతో ఆత్మహత్య ప్రయత్నం చేసిన వరంగల్ మెడికో ప్రీతి నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే నిందితుడు సైఫ్ ను రక్షించడానికి కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అధికారులు ప్రయత్నించారని తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిందితుడిని కాపాడేందుకు మొదట ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించిన‌ గవర్నర్ తమిళిసై ఈ మేరకు కాళోజీ హెల్త్ యూనిర్సిటీ వీసీకి లేఖ రాశారు. సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని గవర్నర్ ఆదేశించారు.

విద్యాసంస్థల్లో ర్యాగింగ్ లు, వేధింపులకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక అందించాలని కాళోజీ వర్సిటీని గవర్నర్ ఆదేశించారు. వైద్య కళాశాల్లో మెడికోలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పనిగంటల వివరాలతో పాటు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పనితీరు తదితర అంశాలపై నివేదిక సమర్పించాలని ఆమె తన లేఖలో ఆదేశించారు.

మెడికల్ కాలేజీలలో యాంటీ ర్యాగింగ్ చర్యలు పటిష్టంగా తీసుకోవాలని గవర్నర్ సూచించారు. మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. ఇలాంటి ఘటనల్లో ఉదాసీనంగా వ్యవహరించకుండా తక్షణం స్పందించి కఠినచర్యలు తీసుకోవాలన్నారు.మహిళా మెడికోలకు కౌన్సెలింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని గవర్నర్ ఆదేశించారు.

First Published:  28 Feb 2023 10:07 AM GMT
Next Story