Telugu Global
Telangana

బీర్లా, మంచినీళ్లా..? తెలంగాణ ఆల్‌టైమ్‌ రికార్డ్‌

రోజుకు 37 కోట్ల రూపాయల విలువ చేసే బీర్లు తాగుతున్నారు. ఒక్కరోజు కూడా పూర్తి కాకుండానే లక్ష కేసుల బీర్లు అలా లేచిపోతున్నాయి.

బీర్లా, మంచినీళ్లా..? తెలంగాణ ఆల్‌టైమ్‌ రికార్డ్‌
X

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఉదయం 9 గంటల నుంచే నిప్పుల కొలిమిలా మారుతుంది. మధ్యాహ్నం ఇంట్లో నుంచి అడుగు భయటపెట్టాలంటే జనం వణికిపోతున్నారు. సాయంత్రం ఏడింటి వరకు వేడి ఏమాత్రం తగ్గడం లేదు. మండిపోతున్న ఎండలతో బీర్లను మంచినీళ్లలా తాగేస్తున్నారు మద్యం ప్రియులు.

18 రోజులు- రూ. 670 కోట్ల బీర్లు..

తాజాగా ఎక్సెజ్ అధికారులు విడుదల చేసిన లెక్కలు చూస్తేనే కిక్కొచ్చేలా ఉంది. కేవలం 18 రోజుల్లోనే 670 కోట్ల రూపాయల విలువ చేసే 23 లక్షల కేసుల బీర్లను తాగేశారు. ఈ రకంగా రోజుకు 37 కోట్ల రూపాయల విలువ చేసే బీర్లు తాగుతున్నారు. ఒక్కరోజు కూడా పూర్తి కాకుండానే లక్ష కేసుల బీర్లు అలా లేచిపోతున్నాయి. ఇది తెలంగాణ చరిత్రలోనే ఆల్‌టైమ్‌ రికార్డు అని అధికారులు చెబుతున్నారు. గతేడాది ఇదేనెలలో జరిగిన బీర్ల అమ్మకాల కంటే ఇది 28.7% అధికం అని చెబుతున్నారు. 15 రోజులుగా బీర్ల తయారీ తగ్గడంతో అమ్మకాలు ఇంకాస్త తగ్గాయని లేదంటే ఇంకా పెరిగి ఉండేవని చెబుతున్నారు. వర్ష ప్రభావం లేకపోవడంతో బీర్ల కొరత ఏర్పడిందని.. డిమాండ్‌కు తగ్గ బీర్లను అందించలేకపోతున్నామని అంటున్నారు.

రికార్డు సెట్‌ చేయాలన్నా మేమే..

మద్యం అమ్మకాల రికార్డులు బద్దలు కొట్టడం తెలంగాణకు ఇది కొత్తేం కాదు. దసరా టైమ్‌లో, సమ్మర్‌ టైమ్‌లో ఇలా కొత్త రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. దసరా టైమ్‌లో వారం రోజుల్లోనే 1100 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగిన రికార్డు తెలంగాణ పేరిట ఉంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ వాళ్ల రికార్డులను వాళ్లే బద్దలు కొడుతున్నట్లు.. తెలంగాణ మద్యం ప్రియులు కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్‌ రికార్డులను సెట్ చేస్తూనే ఉంటారు.

First Published:  24 April 2024 5:24 AM GMT
Next Story