Telugu Global
Telangana

ప్రతి రోజూ రికార్డ్ బ్రేకే.. 11రోజుల్లో రూ.287 కోట్ల సొత్తు స్వాధీనం

రాష్ట్రవ్యాప్తంగా 373 ఫ్లయింగ్ స్క్వాడ్ లు, 374 స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీమ్‌ లు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఎక్కడ ఏ చిన్న సమాచారం వచ్చినా అధికారులు వదిలిపెట్టడంలేదు. క్షుణ్ణంగా తనిఖీ చేసి వాహనాలను పంపిస్తున్నారు.

ప్రతి రోజూ రికార్డ్ బ్రేకే.. 11రోజుల్లో రూ.287 కోట్ల సొత్తు స్వాధీనం
X

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత అక్రమ సొత్తు పట్టుకోవడంలో ప్రతిరోజూ రికార్డ్ బ్రేక్ అవుతోంది. ఎన్నికలకు ఇంకా 40రోజుల టైమ్ ఉంది.. ఇప్పటికే ఊహించని రీతిలో అక్రమ తరలింపులు వెలుగులోకి వస్తున్నాయి. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కేవలం 11 రోజుల్లో రూ. 286,74,01,370 విలువైన సొత్తుని వివిధ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. నగలు, నగదు, వాహనాలు, మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు అధికారులు.

24 గంటల వ్యవధిలో అత్యథికంగా 43 కోట్ల రూపాయల సొత్తు స్వాధీనం.. ఇందులో

నగదు రూ.8,08,02,770

ఆబ్కారీశాఖ స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ.1,68,45,982

గంజాయి సహా మొత్తం మత్తుమందుల విలువ రూ.1,99,86,070

బంగారం 38.24 కిలోలు

వెండి 189.75 కిలోలు

వజ్రాలు 186.195 క్యారెట్లు

ప్లాటినం 5.35 గ్రాములు

బియ్యం విలువ రూ.2,11,36,150

చీరలు, కుక్కర్లు, వాహనాలు వీటికి అదనం.

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి ఇంతవరకు.. 11 రోజుల్లో మొత్తం రూ. 286,74,01,370 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా 373 ఫ్లయింగ్ స్క్వాడ్ లు, 374 స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీమ్‌ లు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఎక్కడ ఏ చిన్న సమాచారం వచ్చినా అధికారులు వదిలిపెట్టడంలేదు. క్షుణ్ణంగా తనిఖీ చేసి వాహనాలను పంపిస్తున్నారు.

First Published:  21 Oct 2023 3:42 AM GMT
Next Story