Telugu Global
Telangana

విద్యాశాఖ కీలక నిర్ణయం.. పది పరీక్షల్లో 6 పేపర్లే..

ప్రతి సబ్జెక్టులోనూ పేపర్‌–1, పేపర్‌–2 బదులు¬గా ఒకే పేపర్‌ ను 80 మార్కులకు ఇస్తారు. మిగిలిన 20 మార్కులకు ఇంటర్నల్స్‌లో విద్యార్థులు పొందిన మార్కులను జతచేస్తారు. నవంబర్‌ 1 నుంచి మొదలుకాబోతున్న సమ్మేటివ్‌ ఇంటర్నల్స్‌ –1 పరీక్షలను కూడా ఇదే విధానంలో నిర్వహించాలనుకుంటున్నారు.

విద్యాశాఖ కీలక నిర్ణయం.. పది పరీక్షల్లో 6 పేపర్లే..
X

టెన్త్ ఎగ్జామ్ పేపర్లపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కూడా పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లు మాత్రమే ఉంటాయని తాజాగా ప్రకటించింది. గతంలో 6 సబ్జెక్ట్ లకు సంబంధించి 11 పేపర్లు ఉండేవి, కరోనా టైమ్ లో వాటిని 6కి కుదించారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో 11 పేపర్లు ఉంటాయని చెప్పినా, ఇప్పుడు ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. ఫైనల్ గా 6 పేపర్లతోనే పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విద్యాశాఖ‌ అధికారులు. దీనికి తగ్గట్టుగా ఉపాధ్యాయులు, విద్యార్థుల్ని సన్నద్ధం చేయాలని సూచించారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్లాసులు సరిగా జరగని పరిస్థితుల్లో విద్యార్థులపై భారం పడకుండా ఉండేందుకు టెన్త్‌ పరీక్ష పేపర్లను తెలంగాణ ప్రభుత్వం 2020-21లో 11 నుంచి 6కు కుదించింది. అయితే కరోనా తీవ్రత దృష్ట్యా ఆ ఏడాది పరీక్షలను రద్దు చేసింది. 2021–22 లో మాత్రం 6 పేపర్లతో పరీక్ష నిర్వహించింది. ఈ ఏడాది పరిస్థితులు చక్కబడటంతో తిరిగి 11 పేపర్లు ఉంటాయని ముందుగానే ప్రకటించారు అధికారులు. కానీ సమ్మేటివ్ పరీక్షల నిర్వహణ సమయానికి అకస్మాత్తుగా 6 పేపర్లకే మొగ్గు చూపారు.

ప్రతి సబ్జెక్టులోనూ పేపర్‌–1, పేపర్‌–2 బదులుగా ఒకే పేపర్‌ ను 80 మార్కులకు ఇస్తారు. మిగిలిన 20 మార్కులకు ఇంటర్నల్ లో విద్యార్థులు పొందిన మార్కులను జతచేస్తారు. నవంబర్‌ 1 నుంచి మొదలుకాబోతున్న సమ్మేటివ్‌ ఇంటర్నల్స్‌ –1 పరీక్షలను కూడా ఇదే విధానంలో నిర్వహించాలనుకుంటున్నారు. దీనికి తగ్గట్టుగానే టైమ్ టేబుల్‌ విడుదల చేశారు. ఇప్పటి వరకూ 11 పేపర్లు ఉంటాయనే ఉద్దేశంతో ఆ దిశగా విద్యార్థుల ప్రిపరేషన్‌ ఉంది. అయితే కొత్త నిర్ణయంతో 6 పేపర్ల కోసం విద్యార్థుల ప్రిపరేషన్ మారాల్సి ఉంటుంది.

First Published:  14 Oct 2022 12:30 AM GMT
Next Story