Telugu Global
Telangana

కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య.. కారణం అదేనా!

కొద్దిరోజుల కిందటే కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల సహా పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లారు. పోలీసులు మాత్రం భార్యాభర్తల మధ్య విభేదాలేం లేవని చెబుతున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య.. కారణం అదేనా!
X

చొప్పదండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య కలకలం రేపింది. హైదరాబాద్‌ అల్వాల్‌లోని పంచశీల కాలనీలోని గురువారం రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోవడానికి ముందు భర్త సత్యానికి ఆమె వీడియో కాల్‌ చేసినట్లు తెలిసింది. ఆ తర్వాతే ఆమె ఉరివేసుకుని చనిపోయింది. ఆ సమయంలో చొప్పదండి నియోజకవర్గంలో ఉన్న ఆయన హుటాహుటిన ఇంటికి వచ్చినప్పటికీ అప్పటికే ఆమె చనిపోయింది.

వికారాబాద్‌లో గవర్నమెంట్‌ టీచర్‌గా పనిచేస్తున్న ఎమ్మెల్యే భార్య రూపాదేవి 2 రోజులుగా స్కూలుకు వెళ్లలేదు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందటే కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల సహా పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లారు. పోలీసులు మాత్రం భార్యాభర్తల మధ్య విభేదాలేం లేవని చెబుతున్నారు. కొంతకాలంగా రూపాదేవి అనారోగ్యంగా ఉందని.. కడుపు నొప్పి భరించలేకే ఆమె చనిపోయిందంటున్నారు. రూపాదేవి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామన్నారు.

First Published:  21 Jun 2024 10:42 AM GMT
Next Story