Telugu Global
Telangana

ధరణి ప్లేస్ లో భూమాత.. విద్యార్థులకు ఇంటర్నెట్ ఫ్రీ

కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తామనే అంశాన్ని కూడా కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో చేర్చినట్టు తెలుస్తోంది. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటించి.. ఆరు నెలల్లో టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామనే హామీతోపాటు.. ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి నియామక ప్రక్రియను పారదర్శకంగా చేపడతామనే హామీ కూడా మేనిఫెస్టోలో పెట్టారు నేతలు.

కాంగ్రెస్ మేనిఫెస్టో: ధరణి ప్లేస్ లో భూమాత.. విద్యార్థులకు ఇంటర్నెట్ ఫ్రీ
X

కాంగ్రెస్ మేనిఫెస్టో: ధరణి ప్లేస్ లో భూమాత.. విద్యార్థులకు ఇంటర్నెట్ ఫ్రీ

కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం అధికారికంగా ఈ మేనిఫెస్టో విడుదల చేయాల్సి ఉన్నా.. ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు అనధికారికంగా సారాంశాన్ని బయటపెట్టాయి. ఆరు గ్యారెంటీలకు తోడు మరిన్ని అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు కాంగ్రెస్ నేతలు. ధరణి రద్దు చేసి దాని స్థానంలో భూమాత అనే పోర్టల్ తీసుకు రావడం, విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం వంటివి ఇందులో ముఖ్యాంశాలుగా ఉన్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తామనే అంశాన్ని కూడా కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో చేర్చినట్టు తెలుస్తోంది. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటించి.. ఆరు నెలల్లో టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామనే హామీతోపాటు.. ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి నియామక ప్రక్రియను పారదర్శకంగా చేపడతామనే హామీ కూడా మేనిఫెస్టోలో పెట్టారు నేతలు.

మరిన్ని ముఖ్యాంశాలు..

- ప్రతి ఏడాది బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధుల కేటాయింపు

- విద్యార్థులందరికీ ఉచితంగా ఇంటర్నెట్‌

- మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు రూ.10వేల వేతనం

- తెలంగాణలో కొత్తగా 4 ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటు

- ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మోకీలు మార్పు సర్జరీ..

- భూహక్కుల సమస్యల పరిష్కారానికి ల్యాండ్‌ కమిషన్‌ ఏర్పాటు

- సర్పంచ్‌ ల ఖాతాల్లో గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధులు జమ

- గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు నెలకు రూ.1500 గౌరవ వేతనం

- ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్‌ డీఏల చెల్లింపు

- సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ పునరుద్ధరణ

- కొత్త పీఆర్సీ ఏర్పాటు చేసి.. ఆరు నెలల్లోనే పీఆర్సీ అమలు

First Published:  16 Nov 2023 5:36 PM GMT
Next Story