Telugu Global
Telangana

ఆ స్థానాల్లో కాంగ్రెస్ వీక్.. తెలంగాణలో అంతర్గత సర్వే

గాంధీ భవన్లో జరిగిన PAC సమావేశంలో 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేశారు. బహిరంగ సభలు, అగ్రనేతలతో డిక్లరేషన్ల విడుదల, రాష్ట్ర నేతల బస్సు యాత్ర.. ఇలా త్రిముఖ వ్యూహం అనుసరించాలని తీర్మానించారు.

ఆ స్థానాల్లో కాంగ్రెస్ వీక్.. తెలంగాణలో అంతర్గత సర్వే
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 35 స్థానాల్లో బాగా వీక్ గా ఉందని ఆ పార్టీ ప్రచార వ్యూహకర్త సునీల్ కనుగోలు తేల్చి చెప్పారు. ఆయా స్థానాలున్న 5 లోక్ సభ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ గెలుపు కష్టం అని వివరించారు. తక్షణమే బలమైన అభ్యర్థులను గుర్తించి వారిని ప్రచార బరిలో దింపాలని, పార్టీని పటిష్టం చేయాలని నాయకులకు సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ(PAC) సమావేశంలో ఈ విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.

గాంధీ భవన్లో జరిగిన PAC సమావేశానికి రాష్ట్ర ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా PAC సభ్యులు హాజరయ్యారు. 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేశారు. ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతుండటంతో తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలకు పదునుపెట్టింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా విజయావకాశాలే గీటురాయి అంటున్నారు నేతలు. బహిరంగ సభలు, అగ్రనేతలతో డిక్లరేషన్ల విడుదల, రాష్ట్ర నేతల బస్సు యాత్ర.. ఇలా త్రిముఖ వ్యూహం అనుసరించాలని తీర్మానించారు.

బీసీలకు 34 సీట్లే..

ప్రతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో కనీసం 50శాతం సీట్లు కావాలని తెలంగాణ కాంగ్రెస్ లోని బీసీ నాయకుల కోరుతున్నారు. అంటే దాదాపు 60 సీట్లు కావాలనేది వారి డిమాండ్. అయితే ఈసారి ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో కనీసం 2 సీట్లు బీసీలకు కేటాయించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రతిపాదించారని తెలుస్తోంది. అంటే మొత్తంగా 34 సీట్లు బీసీలకు ఇవ్వాలనేది తెలంగాణ కాంగ్రెస్ పెద్దల ఆలోచన. దీనికి బీసీ నాయకులు ఒప్పుకుంటారో లేదో చూడాలి.

రేణుక అలక..

కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి రాష్ట్ర పార్టీ పెద్దలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఫోన్ చేసినా కొంతమంది స్పందించడంలేదని, సీనియర్ ని అయిన తన పరిస్థితి ఇలా ఉంటా.. ఇక ఆ నాయకులు, కార్యకర్తలకు ఎలా అందుబాటులో ఉంటారని ప్రశ్నించారామె. మొత్తమ్మీద PAC సమావేశం పెద్దగా గందరగోళం లేకుండానే ముగిసింది.

First Published:  24 July 2023 2:23 AM GMT
Next Story