Telugu Global
Telangana

100 మంది అభ్యర్థులు ఫైనల్‌.. పెండింగ్‌లో ఉన్న 19 స్థానాలు ఇవే!

నవంబర్ 3న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యే నాటికి మూడో జాబితా రిలీజ్ చేస్తారని సమాచారం.

100 మంది అభ్యర్థులు ఫైనల్‌.. పెండింగ్‌లో ఉన్న 19 స్థానాలు ఇవే!
X

100 మంది అభ్యర్థులు ఫైనల్‌.. పెండింగ్‌లో ఉన్న 19 స్థానాలు ఇవే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరో 45 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్‌. మొదటి జాబితాలో 55 మంది, రెండో జాబితాలో 45 మంది కలుపుకుని 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. మరో 19 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. నవంబర్ 3న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యే నాటికి మూడో జాబితా రిలీజ్ చేస్తారని సమాచారం.

ఇక మిగిలిన 19 స్థానాల్లో నాలుగు లెఫ్ట్ పార్టీలకు కేటాయిస్తారని సమాచారం. లెఫ్ట్ పార్టీలకు వైరా, కొత్తగూడెం, మిర్యాలగూడ, చెన్నూరు స్థానాలు కేటాయించే అవకాశాలున్నాయి. ఇక సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న కామారెడ్డి, కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్ల సైతం పెండింగ్ లిస్ట్‌లో ఉన్నాయి.

పెండింగ్ స్థానాలు:

1.వైరా

2.కొత్తగూడెం

3.మిర్యాలగూడ

4.చెన్నూరు

5. చార్మినార్

6.నిజామాబాద్ అర్బన్

7.కామారెడ్డి

8. సిరిసిల్ల

9.సూర్యపేట

10.తుంగతుర్తి

11.బాన్సువాడ

12.జుక్కల్

13.పఠాన్ చెరువు

14.కరీంనగర్

15.ఇల్లందు

16.డోర్నకల్

17.సత్తుపల్లి

18.నారాయణ్ ఖేడ్

19.అశ్వారావుపేట

First Published:  27 Oct 2023 4:57 PM GMT
Next Story