Telugu Global
Telangana

సీఈఓకు కాంగ్రెస్ ఫిర్యాదు..

మొత్తం 4 అంశాలపై సీఈఓకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరామన్నారు.

సీఈఓకు కాంగ్రెస్ ఫిర్యాదు..
X

తెలంగాణ ఎన్నికలు ముగిసినా కూడా కాంగ్రెస్ ఫిర్యాదుల పరంపర మాత్రం ఆగలేదు. తాజాగా కాంగ్రెస్ నేతలు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) వికాస్ రాజ్ ని కలసి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఈసీ కార్యాలయానికి రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి వెళ్లి కంప్లయింట్ చేశారు. డిసెంబర్‌ 4న ఏర్పాటు చేయబోతున్న కేబినెట్‌ భేటీపై కూడా ఫిర్యాదు చేశారు నేతలు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా ఉంచాలని సీఈఓని కోరినట్టు తెలిపారు.

నిధులు దారిమళ్లుతున్నాయి..

బీఆర్‌ఎస్‌ నేతలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఈఓకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. రూ.6 వేల కోట్లను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రయత్నిస్తోందని చెప్పారు. రైతు బంధు నిధుల్ని ఇలా దారిమళ్లిస్తున్నారని ఆరోపించారు. భూరికార్డులు కూడా మారుస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని భూముల్ని ధరణి పోర్టల్‌ లోకి మారుస్తున్నారని కంప్లయింట్ చేశారు. అసైన్డ్‌ భూముల రికార్డుల్ని మార్చకుండా చూడాలని సీఈవోను కోరామని, ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్‌ నిఘా పెట్టాలని కూడా కోరామని తెలిపారు.

మొత్తం 4 అంశాలపై సీఈఓకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరామన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కొన్ని కాంగ్రెస్ కి అనుకూలంగా రావడంతో.. ఆ పార్టీ నేతల హడావిడి మొదలైంది.



First Published:  2 Dec 2023 8:03 AM GMT
Next Story