Telugu Global
Telangana

మా వాటా తేల్చాలంటున్న టీ-కాంగ్రెస్‌ బీసీ నేతలు

నియోజకవర్గాల్లో బీసీ లీడర్‌షిప్ గట్టిగా ఉన్న సెగ్మెంట్‌లలో కూడా బీసీకి టిక్కెట్ రాదని సొంతపార్టీ వారే ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా వాటా తేల్చాలంటున్న టీ-కాంగ్రెస్‌ బీసీ నేతలు
X

టీ-కాంగ్రెస్‌లో బీసీల చిచ్చు రాజుకుంది. ఇతర పార్టీల్లో బీసీలు గెలుస్తున్నప్పుడు కాంగ్రెస్‌లో ఎందుకు ఓడిపోతున్నారని సీనియర్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వాలని టీ-కాంగ్రెస్ సీనియ‌ర్ నేతలపై బీసీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు బీసీ నేతలు సిద్దమయ్యారు. అందులో భాగంగానే టీ-కాంగ్రెస్‌లోని బీసీ సీనియర్ నేతలందరినీ కలిసి చర్చిస్తున్నారు కొందరు నాయకులు. మాజీ మంత్రి పొన్నాలను కలసిన బీసీ నేతలు.. పార్టీలో అన్ని స్థాయిల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చేలా చొరవ చూపాలని కోరారు.

బీసీ నేతలు కలిసిన సందర్భంగా పొన్నాల చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇతర పార్టీలలో బీసీలు గెలుస్తున్నప్పుడు కాంగ్రెస్‌లో మాత్రం బీసీ నేతలే ఎందుకు ఎన్నికల్లో ఓడిపోతున్నారో హైకమాండ్ గుర్తించాలన్నారు. కాంగ్రెస్‌లో బీసీలకు టిక్కెట్‌లు ఇస్తే గెలవడం లేదనేవారు ఇతర పార్టీలలో గెలుస్తున్న బీసీల సంగతేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

నియోజకవర్గాల్లో బీసీ లీడర్‌షిప్ గట్టిగా ఉన్న సెగ్మెంట్‌లలో కూడా బీసీకి టిక్కెట్ రాదని సొంతపార్టీ వారే ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలమైన బీసీ లీడర్లు ఉన్న 45 నియోజకవర్గాల లిస్ట్‌ తయారు చేసిన బీసీ నేతలు.. వచ్చే ఎన్నికల్లో వారికి టిక్కెట్‌లు వచ్చేలా హైకమాండ్ పై ఒత్తిడి తేవాలని డిసైడ్ అయ్యారు.

గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఓకే ఒక బీసీ ఎమ్మెల్యే గెలిచారు. దీంతో బీసీలు కాంగ్రెస్‌కు మద్దతుగా లేరనే విషయాన్ని గుర్తించిన అదిష్టానం బీసీ డిక్లరేషన్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా కనీసం ఇద్దరు బీసీలకు టికెట్‌ ఇవ్వాలనేది బీసీ నేతల డిమాండ్. అది కూడా ఫస్ట్ లిస్ట్‌లోనే ఫైనల్ చేయాలని కోరుతున్నారు. మరి బీసీ నేతల డిమాండ్‌కు అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

First Published:  6 July 2023 7:34 AM GMT
Next Story