Telugu Global
Telangana

ముగిసిన రేవంత్ టీమ్ దావోస్ పర్యటన..

టాటా, సర్జికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ గ్రూప్‌ హోల్డింగ్స్‌, క్యూ సెంట్రియో, ఉబెర్‌, సిస్ట్రా, ఓ9 సొల్యూషన్స్‌ తదితర సంస్థలతో దావోస్ సదస్సులో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం.

ముగిసిన రేవంత్ టీమ్ దావోస్ పర్యటన..
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీమ్ దావోస్ పర్యటన పూర్తయింది. మూడు రోజుల దావోస్ పర్యటన ముగించుకుని వారంతా లండన్ చేరుకున్నారు. అక్కడ రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. లండన్ లో వారికి ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు.


ఇక దావోస్ లో అదానీ సహా వివిధ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. గురువారం సీఎం రేవంత్ రెడ్డి 'ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్స్' అనే అంశంపై దావోస్ లో ప్రసంగించారు. తాను రైతు బిడ్డను అని, వ్యవసాయం తెలంగాణ సంస్కృతి అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన.. భారత్ లో రైతుల కష్టాలను వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందడం లేదని, భారత్ లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ అని ప్రస్తావించారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు. రైతు భరోసాతో అన్నదాతలకు అండగా నిలబడుతున్నామన్నారు. పరోక్షంగా బీఆర్ఎస్ ప్రారంభించిన పథకాన్ని ఆయన మెచ్చుకున్నారు. భారత్ లో రైతులు లాభాలబాట పట్టేందుకు ప్రపంచ దేశాలు సహాయ సహకారాలు అందించాలన్నారు.

టాటా, సర్జికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ గ్రూప్‌ హోల్డింగ్స్‌, క్యూ సెంట్రియో, ఉబెర్‌, సిస్ట్రా, ఓ9 సొల్యూషన్స్‌ తదితర సంస్థలతో దావోస్ సదస్సులో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం.

టాటా గ్రూప్‌ రూ.1,500 కోట్ల పెట్టుబడి

సర్జికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ గ్రూప్‌ రూ.231.5 కోట్లతో వైద్య పరికరాల కేంద్రం

ఉబర్ సంస్థ అతిపెద్ద టెక్ సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం

ఐటీ అభివృద్ధి, సేవల కేంద్రం ఏర్పాటుకు ‘క్యూ సెంట్రియో’

ఓ9 సొల్యూషన్స్‌ శిక్షణ కేంద్రాలు

సిస్ట్రా డిజిటల్‌ సెంటర్‌ ఏర్పాటు

First Published:  19 Jan 2024 5:38 AM GMT
Next Story