Telugu Global
Telangana

రైతుబంధు వచ్చేది అప్పుడే.. రేవంత్ కీలక ప్రకటన

ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్‌ లెవల్‌ కన్వెన్షన్ మీటింగ్‌లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

రైతుబంధు వచ్చేది అప్పుడే.. రేవంత్ కీలక ప్రకటన
X

రైతుబంధుపై కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి నెలాఖరు నాటికి రైతుబంధు పంపిణీ పూర్తి చేస్తామన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్‌ లెవల్‌ కన్వెన్షన్ మీటింగ్‌లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్‌పైనా తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాము రైతుబంధు పథకాన్ని ఆపలేదన్నారు. ప్రతి సన్నాసోడు రైతుబంధు వేయలేదని అడుగుతున్నాడంటూ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో మార్చి 31 వరకు కూడా రైతుబంధు వేయలేదన్నారు రేవంత్.

రైతుబంధు పంపిణీ కోసం డిసెంబర్‌ 9నే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. అయితే రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ నత్తనడకన సాగుతోంది. దీనిపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దాదాపు 40 రోజులు గడిచినప్పటికీ..2.5 ఎకరాల లోపు రైతులకు మాత్రమే రైతుబంధు సాయం అందింది. మొత్తం రైతుబంధు లబ్ధిదారులు 69 లక్షల మంది ఉండగా..ఇప్పటివరకు 45 లక్షల మంది రైతులకు రైతుబంధు చెల్లించామని అధికారులు చెప్తున్నారు.

ప్రస్తుతం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే సీజన్‌కు ఎకరాకు రూ.5 వేలు అందిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకం తీసుకొచ్చి ఏటా ఎకరాకు రూ.15 వేల నగదు సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఇక రైతుబంధు పథకానికి భూమికి పరిమితి విధిస్తారన్న చర్చ కూడా నడిచింది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

First Published:  25 Jan 2024 3:49 PM GMT
Next Story