Telugu Global
Telangana

సెప్టెంబ‌ర్ 17న జాతీయ స‌మైక్య‌తా దినం: తెలంగాణ మంత్రివర్గం నిర్ణ‌యం

సెప్టంబర్ 17వ తేదీని జాతీయ స‌మైక్య‌తా దినంగా పాటించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. 16, 17, 18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వ‌జ్రోత్స‌వాల‌ను కూడా నిర్వ‌హించాల‌ని కూడా కేబినెట్ నిర్ణ‌యించింది.

సెప్టెంబ‌ర్ 17న జాతీయ స‌మైక్య‌తా దినం: తెలంగాణ మంత్రివర్గం నిర్ణ‌యం
X

సెప్టంబర్ 17 పై తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజును జాతీయ స‌మైక్య‌తా దినంగా ప‌రిగ‌ణించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. సెప్టెంబ‌ర్ 17న జాతీయ స‌మైక్య‌తా దినాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని కూడా కేబినెట్ తీర్మానించింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఈ రోజు మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై దాదాపు మూడు గంటలపాటు మంత్రివర్గం చర్చలు జరిపింది. నిజాం రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ పరిణామక్రమం, 2022 సెప్టెంబర్17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగుపెడుతున్నది. ఈ నేపథ్యంలో 2022 సెప్టెంబర్ 17 ను 'తెలంగాణ జాతీయ సమైక్యతా దినం' గా పాటించాలని, 16,17,18 తేదీల్లో జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వాల్లో భాగంగా వ‌జ్రోత్స‌వాల‌ను కూడా నిర్వ‌హించాల‌ని కూడా కేబినెట్ నిర్ణ‌యించింది.

First Published:  3 Sep 2022 1:38 PM GMT
Next Story