Telugu Global
Telangana

సిగ్గు సిగ్గు.. అమిత్ షా బూట్లు మోసిన బండి సంజయ్..

బండి సంజయ్ బూట్లు మోసిన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. బండి బానిస అంటూ ట్విట్టర్ హోరెత్తిపోతోంది. కొత్తగా పార్టీ మారిన, మారే వారికి కూడా ఇదో గుణపాఠం అంటున్నారు నెటిజన్లు.

సిగ్గు సిగ్గు.. అమిత్ షా బూట్లు మోసిన బండి సంజయ్..
X

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలో బండి సంజయ్ ఆయన బూట్లు మోశారు. ఇదేదో వైరి వర్గాలు చేసిన విమర్శ కాదు, నగ్న వీడియోని కవర్ చేసుకోడానికి ఇటీవల ఓ ఎంపీ చెప్పిన మార్ఫింగ్ మాట కూడా కాదు. పక్కా సాక్ష్యాధారాలతో దొరికిపోయిన వీడియో. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకుని గుడి బయటకు అమిత్ షా తిరిగొచ్చే క్రమంలో హడావిడిగా ఆయన వెంట పరిగెత్తుకొచ్చిన బండి సంజయ్ ఆయన బూట్లు తీసుకొచ్చి దగ్గరపెట్టారు. ఇంకో అడుగు ముందుకేస్తే ఆయన బూట్లు అందుకుంటారు, కానీ అంతలోనే సంజయ్ తన స్వామిభక్తి చూపించుకున్నారు. ఆయన బూట్లు చేతితో పట్టుకుని తీసుకొచ్చి ఇచ్చి సంబరపడిపోయారు.

బానిస బతుకులా..?

టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఈటల లాంటి నేతలు పార్టీలో నిరంకుశత్వాన్ని తట్టుకోలేకపోయామని, అందుకే బయటకొచ్చామని విమర్శలు చేశారు. మరి బీజేపీలో జరుగుతున్నదేంటి..? అక్కడ కేవలం ఆధారం లేని విమర్శలు మాత్రమే, ఇక్కడ నేరుగా బూట్లు మోసే పరిస్థితి ఉంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని అందలమెక్కిస్తాం, దళితులకు కిరీటం పెడతామని చెబుతున్న అమిత్ షా, కిరీటం పెట్టిన తర్వాత ఏం చేస్తారనే విషయం ఇప్పుడు తేటతెల్లమైంది. బీజేపీలో బానిస బతుకులు అంటూ ఇప్పుడు సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.

రాజగోపాల్ అందుకే పార్టీ మారారా..?

బండి సంజయ్ బూట్లు మోసిన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. బండి బానిస అంటూ ట్విట్టర్ హోరెత్తిపోతోంది. కొత్తగా పార్టీ మారిన, మారే వారికి కూడా ఇదో గుణపాఠం అంటున్నారు నెటిజన్లు. రాజగోపాల్ రెడ్డి కూడా ఈ భాగ్యానికే పార్టీ మారారా అనే కామెంట్లు వినపడుతున్నాయి. పైకి ప్రగల్భాలు పలికే బండి, 2023 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకోడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అమిత్ షా ని ఆ రేంజ్ లో కాకా పట్టాలా బండి అంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. దీనిపై ఇంకా బీజేపీనుంచి స్పందన రాలేదు.

First Published:  22 Aug 2022 4:23 AM GMT
Next Story