Telugu Global
Telangana

కేంద్రం వివక్షపై తెలంగాణ బీజేపీ నేతల మౌనం... ప్రశ్నలు సంధించిన‌ కేటీఆర్

అస్సాంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలన్న కేంద్రం యోచనపై చేసిన ప్రకటనను ట్వీట్ చేసిన కేటీఆర్, ఈ చర్య మంచిదే. అయితే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని క్లాజులలో ఒకటైన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎందుకు ఏర్పాటు చేయలేదు? తెలంగాణకు వాగ్దానం చేసిన కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని ఎందుకు నిరాకరిస్తున్నారో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు లేదా కేంద్ర మంత్రి ఎవరైనా సమాధానం చెప్పగలరా? '' అని ట్వీట్ లో కామెంట్ చేశారు

కేంద్రం వివక్షపై తెలంగాణ బీజేపీ నేతల మౌనం... ప్రశ్నలు సంధించిన‌ కేటీఆర్
X

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని వాగ్దానాలను కేంద్ర బీజేపీ సర్కార్ అమలు చేయకపోవడం పట్ల అటు ఏపీలోను, ఇటు తెలంగాణలోనూ ప్రజల్లో తీవ్ర అసంత్రుప్తి ఉంది. ఈ రెండు రాష్ట్రాల స్థానిక బీజేపీ నాయకులు ఆ వాగ్దానాల గురించి కనీసం గొంతెత్తకపోవడం పై అనేక‌ విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ ఆ నాయకులు వాటి గురించి మౌనం వహిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం పై ప్రతి రోజూ విమర్శలు గుప్పించే ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గానీ, మరో ఎంపీ ధర్మపురి అరవింద్ కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ తెలంగాణకు ఇచ్చిన వాగ్దానాలపై పార్లమెంటులో కానీ లేదా ప్రధానితో కానీ మాట్లాడిన పాపాన పోలేదు. అసలు విభజన చట్టంలో తెలంగాణకు చేసిన వాగ్దానాలనే వాళ్ళు మర్చి పోయారు.

Advertisement

విభజన చట్టంలో ఉన్న ఖాజీ పేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం పై బీఆరెస్ నాయకులు కేంద్ర ప్ర‌భుత్వానికి ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా కరుణించలేదు. కానీ తాజాగా అస్సాంకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసింది కేంద్రం. దీనిపై బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. అస్సాంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం తమకు సంతోషమే అని కానీ ఖాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు మర్చిపోయారు ? అని ప్రశ్నించారాయన. దీనిపై రాష్ట్ర బీజేపీ నాయకులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

అస్సాంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలన్న కేంద్రం యోచనపై చేసిన ప్రకటనను ట్వీట్ చేసిన కేటీఆర్, ఈ చర్య మంచిదే. అయితే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని క్లాజులలో ఒకటైన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎందుకు ఏర్పాటు చేయలేదు? తెలంగాణకు వాగ్దానం చేసిన కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని ఎందుకు నిరాకరిస్తున్నారో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు లేదా కేంద్ర మంత్రి ఎవరైనా సమాధానం చెప్పగలరా? '' అని ట్వీట్ లో కామెంట్ చేశారు కేటీఆర్.

ఈ విషయంపై తెలంగాణలో వెన్నెముక లేని బీజేపీ నాయకత్వం రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి అని కూడా కేటీఆర్ తన ట్వీట్ లో అన్నారు.

మరి కేటీఆర్ ట్వీట్ పై మంత్రి కిషన్ రెడ్డి ,బండి సంజయ్, అరవింద్ తదితర ఎంపీలు కానీ , బీజేపీ నాయకులు కానీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Next Story