Telugu Global
Telangana

బండి సంజయ్‌ సంచలనం.. రాజకీయాలకు గుడ్‌బై..?

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వేములవాడ, హుస్నాబాద్‌ స్థానాలను పెండింగ్‌లో పెట్టడాన్ని బండి సంజయ్‌ తీవ్రంగా పరిగణిస్తున్నారు.

బండి సంజయ్‌ సంచలనం.. రాజకీయాలకు గుడ్‌బై..?
X

బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ అసంతృప్తితో ఉన్నారా..? సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొద్దిరోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆవేదనకు లోనవుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాలకు గుడ్‌బై చెప్పే ఆలోచన చేస్తున్నారని ఆయన అభిమానులు చెప్తున్నారు.

పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ల‌భించ‌డం లేదన్న నిరాశలో ఉన్నారట బండి సంజయ్. అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత పార్టీలో క్రమంగా బండి సంజయ్ ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. అయితే అసెంబ్లీకి పోటీ చేయడం ఇష్టం లేకపోయినా.. పార్టీ తన పేరును కరీంనగర్‌ స్థానం నుంచి ప్రతిపాదించడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారట బండి. మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని సంజయ్ భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ తనకు కరీంనగర్ అసెంబ్లీ అభ్య‌ర్థిత్వం కేటాయించ‌డంపై బండి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇక ఇటీవల విడుద‌ల చేసిన ఫస్ట్‌ లిస్ట్‌లోనూ తాను సూచించిన వారికి టికెట్లు దక్కకపోవడంతో బండి ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వేములవాడ, హుస్నాబాద్‌ స్థానాలను పెండింగ్‌లో పెట్టడాన్ని బండి సంజయ్‌ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రధానంగా వేములవాడలో మాజీ గవర్నర్ విద్యాసాగర్‌ రావు కొడుక్కి టికెట్ ఇవ్వాలని బండి సంజయ్ కోరుతున్నారు. అయితే ఇదే స్థానంలో తన వెంట బీజేపీలో చేరిన తుల ఉమాకి టికెట్ ఇవ్వాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో వేములవాడ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయాలకు గుడ్‌బై చెప్పి.. హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాలని బండి సంజయ్‌ నిర్ణయించారట. RSSలో పనిచేయాలని భావిస్తున్నారట.

First Published:  23 Oct 2023 8:52 AM GMT
Next Story