Telugu Global
Telangana

తెలంగాణకు 8 ఏళ్ళలో 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు...పీటీఐతో కేటీఆర్

తెలంగాణలో గత 8 ఏళ్ళలో 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. పీటీఐ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులనుకోరారు. వారి వ్యాపార ప్రతిపాదనలకు పూర్తి మద్దతునిస్తానని మంత్రి చెప్పారు.

తెలంగాణకు 8 ఏళ్ళలో 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు...పీటీఐతో కేటీఆర్
X

వ్యాపార అనుకూల విధానాల కారణంగా తెలంగాణ గత 8 ఏళ్లలో వివిధ రంగాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ వాణిజ్యం, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేటీఆర్ రాష్ట్ర పెట్టుబడి విధానాలపై పిటిఐకి తో మాట్లాడారు.

"మేము గత 8 సంవత్సరాలలో TS iPass ద్వారా 20,000 కంటే ఎక్కువ వ్యాపార అనుమతులను ఇచ్చాము. రూ. 2.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడిని ఆకర్షించాము. 16 కోట్ల ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలను సృష్టించాము" అని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం, పెట్టుబడిదారుడికి 15 రోజుల్లోగా అన్ని అనుమతులు ఇస్తున్నాము అని కేటీఆర్ చెప్పారు.

అయితే, వ్యాపారం కోసం అప్లై చేసుకున్న ఎవరైనా పెట్టుబడిదారుడికి తెలంగాణ ప్రభుత్వం నుండి ఎటువంటి సమాచారం రాకపోతే, అతని లేదా ఆమె పెట్టుబడి ప్రతిపాదన ఆమోదించబడినట్లు భావించబడుతుందని, ఆలస్యానికి కారణమైన అధికారికి తదనుగుణంగా జరిమానా విధించబడుతుందని మంత్రి తెలిపారు.

"అంతేకాకుండా, ఎవరైనా ఇప్పటికే అన్ని నియమాలు, నిబంధనలకు అనుగుణంగా ఉంటే, ఆ వ్యక్తి ప్రభుత్వానికి స్వీయ-డిక్లరేషన్ పత్రాన్ని దాఖలు చేయడం ద్వారా మొదటి రోజు నుండి నిర్మాణాన్ని ప్రారంభించవచ్చు" అని ఆయన చెప్పారు.

ఐటీ, ఫార్మా, తయారీ రంగాలు గత 8 ఏళ్లలో అద్భుతమైన వృద్ధిని కనబరిచాయని కేటీఆర్ చెప్పారు.

తెలంగాణలో పనిచేస్తున్న కంపెనీల సంఖ్యపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. తెలంగాణ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ హబ్‌గా ఉంద‌ని, ప్రపంచ వ్యాక్సిన్‌లో 33 శాతం తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయని, భారతదేశంలోని 35-40 శాతం ఫార్మాస్యూటికల్స్‌ను తెలంగాణలోనే తయారు చేస్తున్నామని మంత్రి చెప్పారు.''హైదరాబాద్ ఇన్ఫర్మేషన్, టెక్నాలజీలో ఒక ముఖ్యమైన హబ్. Google, Apple, Microsoft, Facebook, Amazon, Qualcomm వంటి ప్రపంచంలోని అతిపెద్ద IT కంపెనీలు అన్నీ ఇక్కడే ఉన్నాయి". అని కేటీఆర్ చెప్పారు.

గతేడాది ఐటీ రంగంలో 4,50,000 ఉద్యోగాలు ఏర్పడగా, ఒక్క తెలంగాణలోనే 1,50,000 ఉద్యోగాలు వచ్చాయి. ఐటీలో ప్రతి 3 ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణలోనే వస్తుందని చెప్పారు.

5,00,000 మందికి పైగా లైఫ్ సైన్సెస్ లో ఉద్యోగాలు పొందారని తెలిపారు మంత్రి.

రాబోయే 5 సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్న పెట్టుబడుల‌ గురించి అడిగినప్పుడు, కేటీఆర్ మాట్లాడుతూ, "నేను ఎటువంటి లెక్కలు చెప్పను. అన్నీ కార్యరూపం దాల్చినప్పుడు మేము మాట్లాడుతాము. ఇక్క డ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇప్పటికే తమ పెట్తుబడులను అనేక రెట్లు పెంచుతున్నారు.".అని చెప్పారు కేటీఆర్.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌లో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. "మేము ఇక్కడ ప్రశాంత వాతావరణం సృష్టించగలిగాం. అందుకే ఇక్కడ ఒక సారి పెట్టుబడి పెట్టిన వాళ్ళు మళ్ళీ ఇక్కడే మరింత పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు. రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడిలో మళ్ళీ మళ్ళీ పెట్టుబడులు పెట్తిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు పెట్టిన పెట్తుబడే 24 శాతం. " అని మంత్రి చెప్పారు.

ఇటీవలే ఒక టెక్స్‌టైల్ కంపెనీ రూ. 24,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నదని, ష్నైడర్ ఎలక్ట్రిక్ తన రెండో యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తోందని కేటీఆర్ తెలిపారు.

అమెరికా, యూరప్, ఆసియా దేశాలకు చెందిన కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను నేను కోరుతున్నాను. వారి వ్యాపార ప్రతిపాదనలకు పూర్తి మద్దతునిస్తానని మంత్రి చెప్పారు.

First Published:  2 Oct 2022 12:51 PM GMT
Next Story