Telugu Global
Telangana

బయ్యారం ఉక్కు సాధ్యం కాదన్న కిషన్ రెడ్డిపై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్

బయ్యారంలో ఉక్కు ఫ్యాక్ట‌రీ సాధ్యం కాద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి చేసిన ప్ర‌క‌టన పట్ల తెలంగాణ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ మండి పడ్డారు. కిషన్ రెడ్డి ప్రకటన తెలంగాణకు పిడుగుపాటు లాంటిందని ఆమె అన్నారు. అసలు కిషన్ రెడ్డి తెలంగాణ వాడేనా అనే అనుమానం కలుగుతోందని సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బయ్యారం ఉక్కు సాధ్యం కాదన్న కిషన్ రెడ్డిపై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్
X

బయ్యారంలో ఉక్కు ఫ్యాక్ట‌రీ సాధ్యం కాద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి చేసిన ప్ర‌క‌టన పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్న‌ది. బ‌య్యారంలో ఉక్కు ఫ్యాక్ట‌రీ పెడుతామ‌ని అప్ప‌టి యూపీఏ ప్ర‌భుత్వం పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో హామీ ఇచ్చినప్పటికీ బీజేపీ సర్కార్ దాన్ని బుట్టదాఖలు చేయడం పట్ల తెలంగాణ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ మండి పడ్డారు.

కిషన్ రెడ్డి ప్రకటన తెలంగాణకు పిడుగుపాటు లాంటిందని ఆమె అన్నారు. అసలు కిషన్ రెడ్డి తెలంగాణ వాడేనా అనే అనుమానం కలుగుతోందని సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 ఏండ్లకు సరిపడా ముడి ఉక్కు నిల్వలు బయ్యారంలో ఉన్నాయని, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీకి అనువైన పరిస్థితులు ఉన్నాయని నిపుణుల కమిటీ గతంలోనే చెప్పిందని ఆమె తెలిపారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ మంచి కోసం ఒక్క పనైనా చేశారా అని ఆమె ప్రశ్నించారు. కిష‌న్ రెడ్డి వెంటనే త‌న ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేసిన మంత్రి ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలుపై కేంద్రం వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

First Published:  27 Sep 2022 5:45 AM GMT
Next Story