Telugu Global
Telangana

తెలంగాణలో TCL భారీ పెట్టుబడులు..

TCL కంపెనీ తెలంగాణలో వాషింగ్ మెషిన్లను తయారు చేస్తుంది. భవిష్యత్తులో మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ని మరింత విస్తరించే ఆలోచనల్లో కూడా TCL ఉన్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో TCL భారీ పెట్టుబడులు..
X

ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరున్నTCL తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. 225కోట్ల రూపాయల పెట్టుబడితో తెలంగాణలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి తాజాగా ఒప్పందాలు కుదిరాయి. TCLతో రెసోజెట్ సంస్థ సంయుక్తంగా ఈ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. TCL యాజమాన్యానికి, రెసోజెట్ సిబ్బందికి మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.


ఏమేం తయారు చేస్తారంటే..?

TCL కంపెనీ తెలంగాణలో వాషింగ్ మెషిన్లను తయారు చేస్తుంది. భవిష్యత్తులో మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ని మరింత విస్తరించే ఆలోచనల్లో కూడా TCL ఉన్నట్టు తెలుస్తోంది. విస్తరణ తర్వాత రిఫ్రిజిరేటర్లు కూడా తెలంగాణలోనే తయారు చేస్తారు. ఇప్పటికే పలు సంస్థలు తెలంగాణలో ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేస్తుండగా TCL వంటి అంతర్జాతీయ సంస్థ ఇప్పుడు తమ కార్యకలాపాలకోసం తెలంగాణను ఎంపిక చేసుకోవడం విశేషం.

పారిశ్రామిక ప్రగతిలో దూసుకుపోతున్న తెలంగాణకు పరిశ్రమలతోపాటు, ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు కూడా తరలి వస్తున్నాయి. తాజాగా TCL యూనిట్ ఏర్పాటుతో 500మంది యువతకు ఇందులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పరోక్షంగా మరో వెయ్యిమందికి కూడా ఉపాధి దొరుకుతుంది. ఎంఓయూపై సంతకాలు పూర్తవడంతో TCL యూనిట్ ఏర్పాటుకి తెలంగాణలో తొలి అడుగు పడినట్టయింది.

First Published:  28 Jun 2023 8:56 AM GMT
Next Story