Telugu Global
Telangana

"ఆఫ్టర్‌ 9 పబ్".. తొమ్మిది దాటితే అవే పనులు..

హైదరాబాద్‌లోని "ఆఫ్టర్‌ 9 పబ్" అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.

ఆఫ్టర్‌ 9 పబ్.. తొమ్మిది దాటితే అవే పనులు..
X

హైదరాబాద్‌లోని "ఆఫ్టర్‌ 9 పబ్" అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.

బంజారాహిల్స్ రోడ్డు నంబర్‌ 14లో ఉన్న ఈ పబ్‌పై శనివారం అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, సమయం దాటినా పబ్‌ నిర్వహిస్తున్నారనే ఫిర్యాదుతో తనిఖీలు నిర్వహించారు. పోలీసుల సోదాల్లో పబ్‌ నిర్వాహకుల భాగోతం బయటపడింది.

కర్నాటక నుంచి అమ్మాయిలు...

పబ్ నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులను రప్పించి వాళ్లతో అసభ్యకర నృత్యాలు చేయిస్తున్నారు. కర్ణాటకలోని గుల్బర్గా నుంచి యువతులను రప్పించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో 40 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 120మంది కస్టమర్లను అరెస్టే చేశారు. వీరందరికీ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. పబ్‌పై కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ యువతులను మహిళా పునరావాస కేంద్రానికి తరలించారు. పబ్‌లో డ్రగ్స్‌ కూడా వాడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.


First Published:  5 May 2024 8:23 AM GMT
Next Story