Telugu Global
Telangana

సీపీఎం ఫస్ట్‌ లిస్ట్‌.. అభ్యర్థులు వీరే..!

ఫస్ట్‌ లిస్ట్‌ను రిలీజ్ చేశారు. మిగిలిన మూడు స్థానాలకు సాయంత్రానికి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి బరిలోకి దిగనున్నారు.

సీపీఎం ఫస్ట్‌ లిస్ట్‌.. అభ్యర్థులు వీరే..!
X

సీపీఎం ఫస్ట్‌ లిస్ట్‌.. అభ్యర్థులు వీరే..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్‌తో పొత్తు చర్చలు విఫలం కావడంతో ఒంటరిగా బరిలో దిగుతానని ప్రకటించిన సీపీఎం.. తొలి జాబితాను విడుదల చేసింది. ఫస్ట్ లిస్ట్‌లో 14 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆ పార్టీ కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం ప్ర‌క‌టించారు. కాంగ్రెస్‌తో పొత్తు చ‌ర్చ‌లో భాగంగా మిర్యాలగూడ, వైరా స్థానాల కోసం సీపీఎం డిమాండ్ చేసింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో 17 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్ర ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఫస్ట్‌ లిస్ట్‌ను రిలీజ్ చేశారు. మిగిలిన మూడు స్థానాలకు సాయంత్రానికి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి బరిలోకి దిగనున్నారు. మిర్యాలగూడ నుంచి జూలకంటి రంగారెడ్డి పోటీ చేయనున్నారు.

సీపీఎం 14 మంది అభ్యర్థులు వీరే-

భద్రాచలం ( ST) - కారం పుల్లయ్య

అశ్వారావుపేట (ST) - పిట్టల అర్జున్‌

పాలేరు - తమ్మినేని వీరభద్రం

మధిర (SC) - పాలడుగు భాస్కర్‌

వైరా (ST) - భూక్యా వీరభద్రం

ఖమ్మం - ఎర్ర శ్రీకాంత్‌

సత్తుపల్లి (SC) - మాచర్ల భారతి

మిర్యాలగూడ - జూలకంటి రంగారెడ్డి

నకిరేకల్‌ (SC) - చినవెంకులు

భువనగిరి - కొండమడుగు నర్సింహ

జనగాం - మోకు కనకారెడ్డి

ఇబ్రహీంపట్నం - పగడాల యాదయ్య

పటాన్‌చెరు - జె. మల్లికార్జున్‌

ముషీరాబాద్‌ - ఎం. దశరథ్‌

First Published:  5 Nov 2023 6:01 AM GMT
Next Story