Telugu Global
Telangana

తెలంగాణలో ఐటీ రంగం అద్భుతం.. తమిళనాడు ఐటీ మంత్రి కితాబు

తమిళనాడు ఐటీ మంత్రి డాక్టర్ పిటి రాజన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఐటీ, ఇన్నోవేషన్, ఈగవర్నెన్స్ కార్యక్రమాలపై అధ్యయనం కోసం తెలంగాణకు వచ్చింది. ఈ సందర్భంగా ఆ బృందానికి మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు.

తెలంగాణలో ఐటీ రంగం అద్భుతం.. తమిళనాడు ఐటీ మంత్రి కితాబు
X

తెలంగాణ ఐటీ రంగం అభివృద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా కొత్తగా ఐటీ రంగంలో వస్తున్న ప్రతి రెండు ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్ నుంచే ఉంటోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీహబ్ వంటి సౌలభ్యాలతో ఐటీ కంపెనీలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు తమ కార్యకలాపాలకోసం హైదరాబాద్ ని కేంద్రంగా మార్చుకుంటున్నాయి. ఈ అభివృద్ధిని పొరుగు రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవడం విశేషం. తాజాగా తమిళనాడు ఐటీ మంత్రి డాక్టర్ పిటి రాజన్ తెలంగాణపై ఫోకస్ పెట్టారు. రెండురోజుల పర్యటనకోసం ఆయన తన బృందంతో సహా హైదరాబాద్ కి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఐటీ అభివృద్ధిని ప్రశంసించారు.

తమిళనాడు ఐటీ మంత్రి డాక్టర్ పిటి రాజన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఐటీ, ఇన్నోవేషన్, ఈగవర్నెన్స్ కార్యక్రమాలపై అధ్యయనం కోసం తెలంగాణకు వచ్చింది. ఈ సందర్భంగా ఆ బృందానికి మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. సచివాలయంలో వారితో సమావేశమయ్యారు. తెలంగాణలో ఐటీ అభివృద్ధికోసం చేపట్టిన కార్యక్రమాలను వారికి వివరించారు. టి హబ్, టి వర్క్స్, వుయ్ హబ్ గురించి అవగాహన కల్పించారు.


తెలంగాణలో ఐటీ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తుందనే విషయాన్ని తమిళనాడు ప్రతినిధి బృందానికి వివరించారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో అమలవుతున్న వివిధ ఐటీ కార్యక్రమాలు, వినూత్న విధానాల గురించి వారికి తెలియజేశారు. తెలంగాణ ఐటీ విధానాల గురించి విన్న తమిళనాడు మంత్రి అబ్బురపడ్డారు. తమ రాష్ట్రంలో కూడా ఆయా విధానాలు అమలు చేస్తామన్నారు.

First Published:  20 July 2023 11:43 AM GMT
Next Story