Telugu Global
Telangana

నాకు విస్తృత అధికారాలున్నాయి ... ఆమోదం తెలపాల్సిన‌ బిల్లులపై తెలంగాణ గవర్నర్ వ్యాఖ్యలు.

ఆరు చట్టసవరణ బిల్లులతో పాటు మరో రెండు కొత్త బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపి గ‌వ‌ర్న‌ర్ తమిళిసై ఆమోదం కోసం పంపింది. అయితే ఈ బిల్లులను గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. పైగా ఆమె ఈ అంశంపై, గ‌వ‌ర్న‌ర్ కు విస్తృత అధికారాలు ఉంటాయ‌ని, అయిన‌ప్ప‌టికీ తాను త‌న ప‌రిధిమేర‌కే వ్య‌వ‌హరిస్తున్నానని వ్యాఖ్యానించారు.

నాకు విస్తృత అధికారాలున్నాయి ... ఆమోదం తెలపాల్సిన‌ బిల్లులపై తెలంగాణ గవర్నర్ వ్యాఖ్యలు.
X

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌వ‌ర్న‌ర్ కు విస్తృత అధికారాలు ఉంటాయ‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ తాను త‌న ప‌రిధిమేర‌కే వ్య‌వ‌హ‌రిస్తూ విధుల‌ను నిర్వ‌హిస్తున్నాన‌ని అన్నారు. తాను ఎవ‌రికీ వ్య‌తిరేకం కాద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం పంపిన బిల్లులు త‌మ‌కు చేరాయ‌ని, వాటిని త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రించి పంపుతాన‌ని ఆమె తెలిపారు. ఓ వార్తా ఛానెల్ తో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

సెప్టెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆరు చట్టసవరణ బిల్లులతో పాటు మరో రెండు కొత్త బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం కోసం ప్ర‌భుత్వం పంపింది. ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే ఈ బిల్లులను గవర్నర్ ఇంకా ఆమోదించలేదు .

యూనివర్శిటీల్లో రిక్రూట్ మెంట్ కు కామన్ బోర్డు ఏర్పాటు, మునిసిపాలిటీ యాక్ట్ సవరణ, ఆజామాబాద్ పారిశ్రామికాభివృద్ది చట్టం,పారెస్ట్ వర్శిటీ వంటి బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం వేచి ఉన్నాయి. త్వరలోనే ఈ బిల్లుల విషయంపై నిర్ణయం తీసుకొంటామని గవర్నర్ తమిళిసై చెప్పారు.

గ‌త కొంత‌కాలంగా తెలంగాణ ప్రభుత్వానికి,గవర్నర్ కు మధ్య దూరం కొనసాగుతోంది. ఆమె ప్ర‌భుత్వానికి స‌మాంత‌రంగా స‌మావేశాలు, భేటీలు నిర్వ‌హించ‌డం, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో జోక్యం చేసుకోవ‌డం, ప్ర‌భుత్వం పంపిన ప్ర‌తిపాద‌న‌ల‌ను ప్ర‌శ్నిస్తూ ఆమోదం తెల‌ప‌కుండా తిప్పి పంప‌డం వంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారు. దీంతో ముఖ్య‌మంత్రిక ఆమెకు మ‌ధ్య క్ర‌మంగా దూరం పెరిగింది. ఇటీవల చెన్నైలో ఓ పుస్తకం ఆవిష్కరణ సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ విమర్శలు చేసిన విష‌యం తెలిసిందే.

First Published:  24 Oct 2022 1:00 PM GMT
Next Story