Telugu Global
Telangana

'తడీపార్ కౌన్ హై?' హైదరాబాద్ లో ఫ్లెక్సీలు, ట్విట్టర్లో పోస్టులు

బీజెపి అగ్రనేత అమిత్ షా ఇవ్వాళ్ళ మునుగోడు వస్తున్న నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. 'తడీపార్ కౌన్ హై' అనే హ్యాష్ ట్యాగ్ తో నెటిజనులు పోస్టులు హోరెత్తిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా 'తడీపార్ కౌన్ హై' అనే ఫ్లెక్సీలు వెలిశాయి.

తడీపార్ కౌన్ హై? హైదరాబాద్ లో ఫ్లెక్సీలు, ట్విట్టర్లో పోస్టులు
X

హైదరాబాద్ లో మళ్ళీ ఫ్లెక్సీల యుద్దం మొదలయ్యింది. సోషల్ మీడియాలో కూడా బీజేపీపై దాడి ప్రారంభమయ్యింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఇవ్వాళ్ళ బీజేపీ అగ్రనేత అమిత్ షా మునుగోడులో జరిగే బహిరంగ సభలో పాల్గోవడానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పై విమర్షలతో ట్విట్టర్లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు ఆయనకు వ్యతిరేకంగా 'తడీపార్ కౌన్ హై' అంటూ హైదరాబాద్ లో ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. అమిత్ షా వెనక్కి తిరిగి ఉన్న ఫోటోతో 'తడీపార్ కౌన్ హై' 'బైబై మోడీ' అని రాసున్న ఫ్లెక్సీలు హైదరాబాద్ లో చాలా చోట్ల దర్శనమిచ్చాయి.

ఇక ట్విట్టర్ లో నెటిజనులు అమిత్ షా పై విరుచుకపడుతున్నారు. తెలంగాణలో భారీ వర్షాలుపడి, వరదలు వచ్చి కోట్ల నష్టం వస్తే ఒక్క పైసా ఇవ్వని కేంద్ర నాయకులు ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.

''నిన్న హైదరాబాద్ లో మునావర్ ఫారూఖీ కామెడీ షో జరిగింది. ఇవ్వాళ్ళ మునుగోడులో అమిత్ షా స్టాండప్ కామెడీ షో జరగబోతుంది.'' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా...

''BJP పాలనపై తెలంగాణ బలంగా పోరాడుతోంది.ఇతర రాష్ట్రాలు తెలంగాణ పోరాట స్ఫూర్తిని అలవర్చుకోవాలి'' అని విక్ర‌మ్ కుమార్ అనే మరో నెటిజన్ వ్యాఖానించారు.

''అది ఏంటో నాకు అర్థం కాలేదు కానీ ఇద్దరు గుజరాతీలకు ఇది దారుణ‌మైన అవమానమని నాకు అర్థమైంది'' అని తమిళనాడుకు చెందిన సిద్దార్థ కుప్పుస్వామి అనే ఓ నెటిజన్ తమిళంలో వ్యాఖానించారు.

అమిత్ షాపై ఉన్న ఓ క్రిమినల్ కేసులో, గుజరాత్ లో ఉండకుండా కోర్టు ఆయనను బహిష్కరించిన విషయాన్ని గుర్తు చేస్తూ YSR అనే నెటిజన్ ''ఒకప్పుడు గుజరాత్‌లో నివసించేందుకు అర్హత లేనివాడు ఇప్పుడు భారతదేశానికి హోమ్ మినిస్టర్.... అన్ని క్రెడిట్ లు ఇండియన్ హిట్లర్ కే''అని కామెంట్ చేశారు.

''గుజరాత్‌లో హత్య, దోపిడీ కేసులో అరెస్టైన‌ హోం మంత్రిగా ఎవరు ? సుప్రీంకోర్టు ఎవరిని తడీపార్ అని ప్రకటించింది?'' అని వెంకట్ గౌడ్ అనే నెటిజన్ కామెంట్ చేశారు.

కొంత కాలంక్రితం ఢిల్లీ శాసనసభలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు రాఖీ బిర్లా మాట్లాడినా వీడియోను నెటిజన్ లు ట్విట్టర్ లో వైరల్ చేస్తున్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్ అమలు పై ఆమెమాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. అప్పుడే ఆమె 'తడీపార్ కౌన్ హై', 'చాయా వాలా కౌన్ హై' అంటూ మాట్లాడిన మాటల‌ను నెటిజనులు గుర్తు చేస్తున్నారు.


మొత్తంగా ఇవ్వాళ్ళ ట్విట్టర్ అమిత్ షా వ్యతిరేక కామెంట్ల‌తో మారు మోగుతోంది. ఇక మునుగోడులో ఆయన ప్రసంగించే 5 గంటల లోపు ఏంజరగనుందో చూడాలి.

First Published:  21 Aug 2022 7:16 AM GMT
Next Story