Telugu Global
Telangana

మార్గదర్శి తెలంగాణ.. అందుకే టి-వర్క్స్

టి-వర్క్స్ లో అసలు ఏం జరుగుతుంది? మన ఆలోచనను ఆచరణలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? వినూత్న ఆలోచనలు ఎలా వస్తాయి..? అనే అంశాలపై హైస్కూల్ విద్యార్థులకు ప్రత్యేక సెషన్ నిర్వహించారు.

మార్గదర్శి తెలంగాణ.. అందుకే టి-వర్క్స్
X

చిన్నతనం నుంచే విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు రేకెత్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు మంత్రి కేటీఆర్. దానికి అవసరమైన అన్ని వనరులను సమకూరుస్తోందని చెప్పారు. టి-వర్క్స్ ట్వీట్ కి ఆయన స్పందించారు. చిన్నప్పటినుంచే విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆసక్తి పెంచేందుకు టి-వర్క్స్ కృషి చేస్తోందన్నారు.


టి-వర్క్స్ లో విద్యార్థులకు పాఠాలు..

స్టార్టప్ ఆలోచనలు ఉన్నవారికి సహాయం చేసేందుకు, వారి ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు సహకరించేందుకు టి-వర్క్స్ ని స్థాపించింది తెలంగాణ ప్రభుత్వం. వినూత్న ఆలోచనలతో వచ్చే యువతకు టి-వర్క్స్ అండగా నిలబడుతుంది. అయితే ఆ ఆలోచనలు విద్యార్థి దశలోనే వస్తే ఏం చేయాలి, ఆవిష్కరణల విషయంలో ముందడుగు ఎలా వేయాలనే విషయంపై టి-వర్క్స్ ప్రత్యేక వర్క్ షాప్ లు నిర్వహిస్తోంది. తాజాగా కొండాపూర్‌ లోని జడ్పీ హైస్కూల్ కి చెందిన 80 మంది విద్యార్థులు టి-వర్క్స్‌ ను సందర్శించారు. ఈ సందర్శన ద్వారా విద్యార్థులు ఆయా రంగాలు, ఆవిష్కరణలపై అనుభవాన్ని గడించారని టి-వర్క్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

టి-వర్క్స్ లో అసలు ఏం జరుగుతుంది? మన ఆలోచనను ఆచరణలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? వినూత్న ఆలోచనలు ఎలా వస్తాయి..? అనే అంశాలపై హైస్కూల్ విద్యార్థులకు ప్రత్యేక సెషన్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను టి-వర్క్స్ ఖాతానుంచి అప్ లోడ్ చేశారు. ఈ ట్వీట్ కి మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ కృషిని ఆయన వివరించారు.

First Published:  7 Sep 2023 11:38 AM GMT
Next Story