Telugu Global
Telangana

హైదరాబాద్ లో స్తంభించిన స్విగ్గీ, జొమాటో సేవలు.. ఎందుకంటే..?

సప్లై చేసేందుకు డెలివరీ బాయ్స్ అందుబాటులో లేక చాలా వరకు ఆర్డర్లు తీసుకోలేదు. కస్టమర్ల ఆర్డర్లను యాప్స్ నిరాకరించాయి. నెట్ వర్క్ సమస్యలు కూడా ఉండటంతో ఫుడ్ డెలివరీ సమస్యలు ఎదురయ్యాయి.

హైదరాబాద్ లో స్తంభించిన స్విగ్గీ, జొమాటో సేవలు.. ఎందుకంటే..?
X

హైదరాబాద్ లో స్విగ్గీ, జొమాటో సేవలు తాత్కాలికంగా స్తంభించాయి. ఆర్డర్లు తీసుకోడానికి ఆ రెండు సంస్థలు తటపటాయిస్తున్నాయి. ఒకవేళ ఆర్డర్ తీసుకున్నా కూడా కస్టమర్లు అడిన టైమ్ కి డెలివరీ ఇవ్వలేమని ముందుగానే చెప్పేస్తున్నాయి. డెలివరీ టైమ్ విషయంలో ఆప్షన్ డెలివరీ బాయ్స్ దే అని కరాఖండిగా చెబుతున్నాయి. దాదాపుగా హైదరాబాద్ అంతా ఇదే పరిస్థితి. మంగళవారం నగరంలో ఏ ఒక్క చోట కూడా చెప్పిన టైమ్ కి డెలివరీ అందలేదు.

భారీ వర్షాల ప్రభావంతో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి బయట అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి. వాహనంలో రోడ్డుపైకి వెళ్తే, ఎక్కడ ఏ ఇబ్బంది వస్తుందో అని జంకుతున్నారు. అసలు రోడ్డుపైకి వెళ్తే తిరిగి ఇంటికొస్తామా, ట్రాఫిక్ లో చిక్కుకుని గంటల తరబడి ఆగిపోతామా అనే ఆందోళన అందరిలో ఉంది. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ ది కూడా ఇదే పరిస్థితి. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోయి అవస్థలు పడ్డారు డెలివరీ బాయ్స్. పైగా బైక్ పైనే వర్షంలో తడుస్తూ ఉండాల్సిన పరిస్థితి. దీంతో చాలామంది మంగళవారం విధులకు హఠాత్తుగా సెలవు పెట్టేశారు.

డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ..

మరోవైపు వర్షాలకు నగరవాసులు ఇళ్లలోనే ఉండిపోయారు. కనీసం కూరగాయలు, లేదా కర్రీస్ పాయింట్ కి వెళ్లి కూరలు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. దీంతో చాలామంది ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేశారు. యాప్ లో రద్దీ పెరిగింది. కానీ సప్లై చేసేందుకు డెలివరీ బాయ్స్ అందుబాటులో లేక చాలా వరకు ఆర్డర్లు తీసుకోలేదు. కస్టమర్ల ఆర్డర్లను యాప్స్ నిరాకరించాయి. ఒక వేళ బుక్ అయినా.. వాటిని డెలివ‌రీ చేసేందుకు ఎక్కువ స‌మ‌యం ప‌డుతోందని కస్టమర్లకు చెబుతున్నారు. నెట్ వర్క్ సమస్యలు కూడా ఉండటంతో ఫుడ్ డెలివరీ సమస్యలు ఎదురయ్యాయి.

First Published:  6 Sep 2023 1:58 AM GMT
Next Story