Telugu Global
Telangana

స్వచ్చ్ సర్వేక్షణ్:16 అవార్డులతో దేశంలో తెలంగాణ రెండవ‌ స్థానం... కేటీఆర్ అభినందనలు

స్వచ్చ్ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ రెండవ‌ స్థానంలో నిలిచింది. 16 అవార్డులు సాధించినందుకు గాను అధికారులకు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు.

స్వచ్చ్ సర్వేక్షణ్:16 అవార్డులతో దేశంలో తెలంగాణ రెండవ‌ స్థానం... కేటీఆర్ అభినందనలు
X


స్వచ్చ్ సర్వేక్షణ్ 2022 అవార్డుల్లో 16 అవార్డులు సాధించి తెలంగాణ దేశంలో రెండవ స్థానంలో నిలిచింది. ఈ అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఇటీవల ప్రకటించింది.శనివారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు.

ఉత్తమ స్వయం సమృద్ది నగరం, అత్యంగా వేగంగా అభివృద్ది చెందుతున్న నగరం, అత్యంత పరిశుభ్రమైన నగరం, పౌరుల అభిప్రాయంలో ఉత్తమ నగరం, ఇన్నోవేషన్, బెస్ట్ ప్రాక్టీస్'లో బెస్ట్ సిటీ తదితర కేటగిరీల కింద భూత్ పూర్, చండూరు, చిట్యాల, కొత్తపల్లి, నేరేడ్ చర్ల, ఘట్ కేసర్, హుస్నాబాద్, కొంపెల్లి, ఆదిబట్ల, వేములవాడ , గజ్వేల్, తురక యాంజాల్, సిరిసిల్ల, బడంగ్ పేట్, కోరుట్ల, సికిందరాబాద్ మొదలైన 16 నగరాలకు అవార్డులు వచ్చాయి.

16 పట్టణాలకు అవార్డులతో తెలంగాణ రెండవ‌ స్థానంలో ఉండగా 19 పట్టణాలతో మహారాష్ట్ర మొదటి స్థానం, 14 పట్టణాలతో అస్సాం మూడవ స్థానం, మధ్యప్రదేశ్ నాలుగవ స్థానం, ఉత్తరప్రదేశ్ 5వ స్థానం, ఒడిశా 6, పంజాబ్ 7, చత్తీస్ గడ్8, ఆంధ్రప్రదేశ్9, ఉత్తరాఖండ్ 10, గుజరాత్11, కర్నాట్క12, జార్ఖండ్13, మణిపూర్14, మిజోరాం 15, అరుణాచల్ ప్రదేశ్ 16, డయ్యూ డామన్ 17, హర్యాణా 18, హిమాచల్ ప్రదేశ్ 19, పాండిచ్చేరి20, బీహార్21, చండీ గర్ 22, ఢిల్లీ 23, జమ్ము కశ్మీర్ 24, రాజస్థాన్ 25, తమిళనాడు 26వ స్థానంలో ఉన్నాయి.

కాగా తెలంగాణ 16 అవార్డులతో రెండవ‌ స్థానం సాధించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ అడ్మిని స్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ అధికారులకు ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు, మున్సిపల్ చైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్ ల కు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌కు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. అర్బన్‌ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రం 16 అవార్డులతో రెండోస్థానంలో నిలిచిందని, మార్గనిర్దేశనం చేస్తూ, పర్యవేక్షించిన మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.




First Published:  1 Oct 2022 3:08 PM GMT
Next Story