Telugu Global
Telangana

రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

కమెడియన్ మునావర్ షో సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
X

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నది. అసెంబ్లీ ఎన్నికల జాబితా విడుదలకు ముందే గోషామహల్ విషయంలో తుది నిర్ణయానికి వచ్చింది. బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తేసింది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో కమెడియన్ మునావర్ షో సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక వర్గాన్ని కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే గోషామహల్ నుంచి బలమైన నాయకుడిగా ఉన్న రాజాసింగ్‌పై వేటు వేయడంతో బీజేపీలోని ఒక వర్గం తీవ్ర అసంతృప్తిగా ఉన్నది. గతంలో మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేతపై అధిష్టానంతో చర్చించినా ఫలితం లేకపోయింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తొలి జాబితా నేడు విడుదల చేయనున్న నేపథ్యంలో రాజాసింగ్‌ సస్పెన్షన్‌పై నిర్ణయం తీసుకున్నది. తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని రాజాసింగ్ కేంద్ర కమిటీకి రాసిన లేఖను పరిశీలించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ ఒక లేఖను విడుదల చేసింది.

మరోవైపు తెలంగాణ ఎన్నికలపై బీజేపీ దూకుడు పెంచింది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ శనివారం అర్థరాత్రి వరకు సమాలోచనలు చేసింది. అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర కమిటీ ఇప్పటికే ప్రధాని మోడీతో పాటు పార్లమెంటరీ బోర్డుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంటిలో కూడా పలు దఫాలుగా చర్చలు చేశారు. ఈసారి ఎన్నికల్లో బీసీలు, మహిళలకు ఎక్కవ సీట్లు ఇచ్చేందుకు బీజేపీ మొగ్గు చూపుతోంది. కాగా, రాజాసింగ్‌కు తిరిగి గోషామహల్ టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి.




First Published:  22 Oct 2023 6:22 AM GMT
Next Story