Telugu Global
Telangana

జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్‌లో 27న సూప‌ర్ స్టార్ కృష్ణ పెద్ద‌క‌ర్మ

ఈ నెల 27వ తేదీన జ‌రిగే పెద్ద‌క‌ర్మ‌కు అభిమానుల‌ను అనుమ‌తించడంతోపాటు, మహేష్ బాబు స్వయంగా కలిసే అవకాశం ఉంద‌ని సినిమా వ‌ర్గాల స‌మాచారం.

జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్‌లో 27న సూప‌ర్ స్టార్ కృష్ణ పెద్ద‌క‌ర్మ
X

దివంగత న‌టుడు, సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ ఈ ఆదివారం హైద‌రాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ లో జ‌రుపుతున్న‌ట్లు తెలిసింది. ఇటీవ‌లే కృష్ణ అస్తిక‌ల‌ను విజ‌య‌వాడ‌లోని కృష్ణా న‌దిలో క‌లిపి వ‌చ్చిన మ‌హేష్‌బాబు, ఈ పెద్ద క‌ర్మ కార్య‌క్ర‌మానికి కృష్ణ‌, మ‌హేష్ బాబు అభిమానుల‌ను కూడా ఆహ్వానించాల‌నుకుంటున్న‌ట్లు ఫిల్మ్‌న‌గ‌ర్ న్యూస్‌. కృష్ణ అస్తికలు మొద‌ట కృష్ణ నదిలో కలిపిన త‌రువాత దేశంలోని ప్ర‌ముఖ న‌దుల్లో క‌ల‌పాల‌ని నిర్ణ‌యించారు. చిన్న క‌ర్మ కార్య‌క్ర‌మానికి కేవ‌లం స‌న్నిహిత కుటుంబ‌స‌భ్యులు, బంధువులు, సినీ ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే అనుమ‌తించారు. మిగతా కర్మలు అన్నీ కూడా పద్మాలయ స్టూడియోస్ లో నిర్వ‌హిస్తున్న‌ట్టు చెబుతున్నారు.

కృష్ణ తో, ఆయ‌న కుటుంబంతో స‌న్నిహిత పరిచయం వున్న చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది పద్మాలయ స్టూడియోస్ లో మహేష్ బాబుని కలిసి ప‌రామ‌ర్శిస్తున్నారు. కృష్ణ తుదిశ్వాస విడిచిన వార్త తెలుసుకుని చివ‌రి చూపు కోసం అంత్యక్రియల రోజు చాలామంది అభిమానులు ఎక్కడెక్కడ ఊర్ల నుండో వచ్చి పద్మాలయ స్టూడియోస్ కి వచ్చారు. కానీ, ఆ రోజు చాలామంది వ‌చ్చి కూడా క‌డ‌సారి చూపు చూడలేకపోయారు. ఈ ప‌రిస్థితుల్లో ఈ నెల 27వ తేదీన జ‌రిగే పెద్ద‌క‌ర్మ‌కు అభిమానుల‌ను అనుమ‌తించడంతోపాటు, మహేష్ బాబు స్వయంగా కలిసే అవకాశం ఉంద‌ని సినిమా వ‌ర్గాల స‌మాచారం.

First Published:  23 Nov 2022 9:13 AM GMT
Next Story