బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధి ఆత్మహత్య.. క్యాంపస్ లోకి పోలీసులు..
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న సురేష్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన విద్యార్థులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి సురేష్ మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
BY Telugu Global23 Aug 2022 11:01 AM GMT

X
Telugu Global23 Aug 2022 11:01 AM GMT
బాసర ట్రిపుల్ ఐటీలో సురేష్ అనే విద్యార్ధి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. నిజామాబాద్ డిచ్ పల్లికి చెందిన సురేష్ తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న సురేష్ సూసైడ్ పై అధికారులు స్పందించడం లేదంటూ విద్యార్థులు క్యాంపస్ లో ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకోగా .. వారి వాహనాలను విద్యార్థులు ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రధాన రహదారిపై రాస్తారోకో ఆందోళనకు దిగారు. సురేష్ ఆత్మహత్యకు కారణం తెలియలేదని, అతడు చనిపోయి చాలాసేపు అయినా అంబులెన్స్ కోసం అధికారులు ఫోన్ చేయలేదని, ఆసుపత్రికి తరలించేందుకు ముందుకు రాలేదని విద్యార్థులు తెలిపారు. వారి నిరసనల మధ్య పోలీసులు సురేష్ మృతదేహాన్ని భైంసా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
,
Next Story